గద్దల కొండ గణేష్ పారితోషకం 8 కోట్లు ?

అమరావతి: వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరో వరుణ్ తేజ్  తన పారితోషకం పెంచినట్ల ఫిల్మ్ నగర్ సమాచారం.తన తొలి సినిమా నుండి వైవధ్య భరితమై పాత్రలను ఎంపిక చేసుకుంటు ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్,ఇటీవల ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో క్లాస్ అడియన్స్ తో పాటు మాస్ ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నారు. గద్దలకొండ గణేష్’ సినిమాకు ముందు వరుణ్ తేజ్ రూ.3 నుంచి రూ.4 కోట్ల పారితోషికం వుండగా, ఈ సినిమా కమర్షియల్‌గా సకెస్స్ తో ఇప్పుడు వరుణ్ తేజ్ రూ.7 నుంచి రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. ‘తొలిప్రేమ’, ‘ఎఫ్2’, ‘గద్దలకొండ గణేష్’ ఇలా వరుస హిట్లు సాధించడంతో వరుణ్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.వరుణ్ రెమ్యునరేషన్ పెంచేసినప్పటికీ నిర్మాతలు అయన కాల్ షీట్స్ కోసం  అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.వరుణ్‌తో సినిమా అంటే హిట్టు గ్యారంటీ అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలుగజేశారు.ప్రస్తుత వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా నటించనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం,శిక్షణ కోసం ఇప్పటికే వరుణ్ ముంబై వెళ్లారు.