నేటి నుండి రాష్ట్రంలో వాహ‌నల‌కు 39 సీరిస్‌తో రిజిస్ర్టేష‌న్స్‌

అమ‌రావ‌తిః ఒక రాష్ట్రం-ఒక నంబర్ సిరీస్ బుధ‌వారం నుండి అమల్లోకి వచ్చింది.ఇది ఒక విధంగా రవాణా శాఖలో కీలక సంస్కరణ అని చెప్పుకోవ‌చ్చు.ఈ విధ‌నంలో నేటి నుంచి అమ్ముడయ్యే అన్నివాహనాలకు AP 39 సిరీస్ తో నంబర్ ప్లేట్లను జారీచేస్తారు. ఏపీ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏపీ 39 సిరీస్ లో తొలి నంబర్ ‘AP 39 0002’ను ముప్పాళ్ల కల్ప‌న అనే మహిళకు అందజేశారు. ఇక నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ RTC వాహనాలకు AP 39 Z, పోలీసుల వాహనాలకు AP 39 P, రవాణా వాహనాలకు AP 39 T, U, V, W, X, Y సిరీస్ లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయం నేపథ్యంలో ఇప్పటివరకూ జిల్లాల వారీగా అమలు చేస్తున్న సిరీస్ విధానం ముగిసిపోనుంది.

LEAVE A REPLY