క్యాన్స‌ర్‌ ఆసుప‌త్రి,జిల్లాకు రావ‌డంలో రెడ్‌క్రాస్ నిర్ల‌ల‌క్ష్యం ?

0
167

నెల్లూరుః రెడ్‌క్రాస్ సంస్ధ ప్ర‌భుత్వ ఆసుపత్రితో కాకుండా హోమిబాబావారితో ఒప్పందం చేసుకుని మెరుగైన క్యాన్సర్ హాస్ప‌ట‌ల్ తీసుకుని వస్తామ‌ని చెప్పి ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం గ‌డిచింద‌ని క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ సాధ‌న క‌మిటి క‌న్విన‌ర్ డాక్ట‌రు.ద‌త్త‌త్ర‌యులు అన్నారు.గురువారం స్దానిక జెట్టి.శేషారెడ్డి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన క్యాన్స‌ర్ సాధ‌న క‌మిటి స‌మావేశంలో అయ‌న పాల్గొని మాట్లాడుతూ ఒక నిర్దిష్ట‌మైన ప్ర‌ణాళిక లేకుండా హామీలు ఇవ్వ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన క్యాన్స‌ర్‌ ఆసుప‌త్రి, నెల్లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి రావ‌డంలో రెడ్‌క్రాస్‌,జిల్లామంత్రులు,అధికారులు,రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో డోల‌య‌మానంలో ప‌డింద‌ని ఎమ్మేల్సీ విఠ‌పు. బాల‌సుబ్రమ‌ణ్యం అన్నారు.నెల్లూరుకు క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ వచ్చేవిధంగా మంత్రులు,అధికారులు,ప్ర‌భుత్వం కృషి చేయాల‌ని,ఈ దిశ‌గా ప్ర‌జ‌ల్లో ఆవ‌గాహ‌న పెంచేలా కార్య‌క్ర‌మం రూపొందించుకొవాల‌ని స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌జాసంఘాలు,సామాజిక కార్య‌క‌ర్త‌లు,స్వ‌చ్చంద సంస్ద‌లు ముక్త‌క‌ఠంతో కోరారు.

LEAVE A REPLY