కో-ఆర్డినేటర్ అంటే ముమ్మాటికీ బ్రోకరే-వ‌ర్మ‌

0
129

అమ‌రావ‌తిః సినిమా ప‌రిశ్ర‌మ‌లో కో-ఆర్డినేటర్ అంటే ముమ్మాటికీ బ్రోకరేనని,పరిశ్రమలో వేళ్లూనుకున్న కో-ఆర్డినేటర్ వ్యవస్థ గుట్టును దర్శకుడు రామ్‌గోపాల్ వర్మబ‌ట్ట‌బ‌య‌లు చేశారు.అయ‌న ఒక సంద‌ర్బంలో స్పందిస్తు కొన్ని వందల మంది అమ్మాయిలను ఈ కోఆర్డినేటర్లు క్యార్ట‌క‌ర్స్‌ హ్యాండిల్ చేస్తారని అన్నారు.దర్శకులకు అమ్మాయిల లిస్టును పంపుతుంటారని,50 మంది అమ్మాయిల ఫొటోలను పంపితే,అందులో కాంప్రమైజ్ కు సిద్ధంగా ఉన్న10 మంది అమ్మాయిలను ఓ సెపరేట్ కేటగిరీలో పెడతారని తెలిపారు.ప్రతి ఒక్క డైరెక్టర్ కు కోఆర్డినేటర్లు ఇలాగే పంపుతారని చెప్పారు.ఒక అమ్మాయి సినిమాల్లోకి రావాలంటే ఈ కోఆర్డినేటర్ అనే వాడితో కూడా కాంప్రమైజ్ కావాల్సిందేనని తెలిపారు.ఇక్కడ కోఆర్డినేటర్ అనేది ఒక జాబ్ మాత్ర‌మేన‌ని,దానికి టాలెంట్, డబ్బు అవసరం లేదన్నారు.డబ్బుకోసం ఒక్కోక్క‌రు ఒక్కో ప‌ని చేస్తార‌ని,కోఆర్డినేటర్ కూడా వాడి పని వాడు చేస్తాడన్నారు.

LEAVE A REPLY