ప్లాట్ లో జరుగుతున్న వ్యభిచారం గుట్టు రట్టు

నెల్లూరు గుట్టు చప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తులను బాలాజీ నగర్ సి.ఐ సోమయ్య ఆధ్వర్యంలో ఆపార్టమెంట్ లోని ప్లాట్ పై సోమవారం వేకువజామున దాడులు నిర్వహించి వ్యభిచారం  నడుపుతున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.వ్యభిచారం చేయించేందుకు తీసుకొచ్చిన మహిళను సంరక్షణ కేంద్రానికి తరలించారు.నెల్లూరు నగరంలోని రాంజీనగర్ 7వ వీధిలో ఉన్న SS విల్లా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 201లో వ్యభిచారం జరుగుతుందని బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో CI తన సిబ్బంది  SIలు వీర ప్రతాప్, అంకమ్మలు తమ సిబ్బందితో కలిసివెళ్లారు. తెల్లవారుజామునే అపార్ట్ మెంట్ వద్దకు వెళ్లి తనిఖీలు చేసి వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.దీంతో అక్కడున్న కల్లూరుపల్లికి చెందిన చక్కిరాల రామచంద్ర, వెంకటేశ్వరపురంకు చెందిన సూరాయపాళెం సుభాషిణి, రంగనాయకులపేటకు చెందిన సయ్యద్ ఖాజా మోహిద్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు.వ్యభిచారం చేసేందుకు తీసుకొచ్చిన 32 ఏళ్ల మహిళను సంరక్షణ కేంద్రానికి తరలించారు.ఇంట్లో లభించిన రూ.13,760 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 8 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY