న‌వ‌నిర్మాణ‌దీక్ష వేదిక స‌డెన్‌గా మారేందుకు కార‌ణం వైసిపి ఎమ్మేల్యేలా ?

0
88

లోగుట్టు పెరుమాళ్ల‌కే ఎరుక‌
నెల్లూరుః న‌వ‌నిర్మాణ‌దీక్ష ముగింపు కార్య‌క్ర‌మం నెల్లూరు ప‌ట్ట‌ణంలోని వి.ఆర్‌.హైస్కూల్ గ్రౌండ్స్‌లో జ‌ర‌గాల్సి వుండ‌గా స‌డెన్‌గా వేదిక నాయుడ‌పేట‌కు ఎందు మారింది అనేది స‌గ‌టు ప‌ట్ట‌ణ ప్ర‌జానీకంకు ఆర్ద‌కాని ప్ర‌శ్న‌గానే మిగిలింది.జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు వేదిక మార్పు చేసేందుకు వివిధ కార‌ణ‌లు చెప్పుతున్న‌ప్ప‌టికి,వై.ఎస్‌.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటి,రూర‌ల్ ఎమ్మేల్యేను ప్రొటోకాల్ ప్ర‌కారం వేదికపైకి ఆహ్వ‌నిచ‌డంతో పాటు,సిటి ఎమ్మేల్యే స‌భ అధ్య‌క్ష‌డుగా వ్య‌వ‌హ‌రించాల్సి వుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్యనిస్తున్నారు.రెండు రోజుల క్రింద‌ట‌ వై.సి.పి సిటి ఎమ్మేల్యే అనిల్‌కుమార్,ప్ర‌జాదీవెన కార్య‌క్ర‌మంలో భాగంగా అయ‌న మాట్లాడుతూ ప‌ట్ట‌ణంలోని బ‌ర్మాషెల్‌గుంట వ‌ద్ద నివాసం వుంటున్న‌పేద‌ల‌ను ఇళ్లు ఖాళీ చేయించే ముందు వారికి ప్ర‌త్నమాయంగా స్ద‌లాలు చూపాల‌ని,ప‌ట్ట‌ణంలో డ్రైనేజ్ వ్య‌వ‌స్ద ఆస్త‌వ్య‌స్తంగా వుంద‌ని,ఆంద‌రికి ఇళ్ల ప‌థ‌కంలో చ‌.అ.మిగిలి జిల్లాలో రూ.1000,,వ‌సూలు చేస్తుండ‌గా,నెల్లూరు రూ.2000 వేలు వ‌సూలు చేయ‌డంపై త్రీవ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో పాటు,న‌వ‌నిర్మాణదీక్ష ముగింపు కార్య‌క్ర‌మంలో వేదిక‌పై స‌ద‌రు విష‌యాల‌ను ముఖ్య‌మంత్రి తీసుకుని వెళ్లి ప్ర‌శ్నిస్తాని చెప్ప‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సి విష‌యం.విజ‌య‌వంతంగా న‌వ‌నిర్మాణ‌దీక్ష ముగింపు కార్య‌క్ర‌మం జ‌రుపుకుంటున్న సంద‌ర్బంలో ప్ర‌తి ప‌క్ష‌ల ఎమ్మేల్యే మాట్లాడితే,ఆ విష‌యంలో ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌డంతో పాటు,ప్ర‌తిప‌క్షపార్టీకి ఆస్త్రం అందించ‌న‌ట్లు అవుతుంద‌నే కోణం కూడా దాగివుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.ప్ర‌తిప‌క్షపార్టీ ఎమ్మేల్యేగా వున్న నియోజ‌క వ‌ర్గాల్లో ప్రారంభ‌,ముగింపు స‌భలు జ‌రిపితే,లేని పోని త‌ల నొప్పులు తెచ్చుకొవ‌డం ఎందుకని,స‌భ స్ద‌లం మార్చ‌ర‌న్న గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి.ఏది ఏమైన‌ప్ప‌టికి ఈనెల‌లోనే ముఖ్య‌మంత్రి మ‌రో కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి వుంది.మారి అప్పుడు ఎలాంటి వ్యుహంను అధికారపార్టీ ఆమ‌లు చేస్తుందో వేచి చూడాల్సిందే ??

LEAVE A REPLY