ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌తో ట్రాఫిక్ మ‌ళ్లీంపు

0
120

నెల్లూరుః 8వ తేది ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా ఉద‌యం 10 గంట‌ల నుండి నాయుడుపేట మ‌ల్లాం కూడ‌లి నుండి తిరుప‌తికి వెళ్లు అన్న వాహ‌నాల‌ను సూళ్లూరుపేట మండ‌లం మ‌న్నారుపోలూరు నుండి తిరుప‌తికి సి.ఎం కార్య‌క్ర‌మం పూర్తి అయ్యే వ‌ర‌కు మ‌ళ్లించ‌డం జ‌రుగుతుంద‌ని నాయుడుపేట సి.ఐ గురువారం తెలిపారు.అలాగే తిరుప‌తి నుండి నెల్లూరుకు వెళ్లే వాహ‌నాల‌ను చిత్తూరు జిల్లా ఏర్పేడు నుండి వెంక‌ట‌గిరి మీదగా,,,చెన్నై వెళ్లే వాహ‌నాల‌ను శ్రీక‌ళాహ‌స్తి వ‌ద్ద త‌డ వైపు మ‌ళ్లించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.కార్య‌క్ర‌మంల‌కు హాజ‌రైయ్యే ప్ర‌జ‌లు వారి వాహ‌నాలు మ‌ల్లాం సెంట‌ర్ వ‌ద్ద‌,జువ్వ‌ల‌పాలెం రోడ్డు వ‌ద్ద వున్న ఖాళీ ప్ర‌దేశంలో పార్క్ చేసుకొవాల‌న్నారు.ALCM Grounds వ‌ర‌కు ఎలాంటి వాహ‌న‌లు అనుమ‌తించ‌బ‌డ‌వ‌న్నారు.

LEAVE A REPLY