ఎర్ర‌చంద‌నం ముఠాల మ‌ధ్య గ్యాంగ్ వార్‌-ఎస్పీ

0
187

6 తుపాకులు,800 గ్రా..బంగారం,35 ఎర్ర‌చంద‌నం దుంగ‌లు..
నెల్లూరుః ఎర్ర‌చంద‌నం ఆక్ర‌మ ర‌వాణా చేసే గ్యాంగుల మ‌ధ్య అధిత‌ప‌త్యంపోరు జ‌రుగుతుంద‌ని,త‌మిళ‌నాడు,క‌ర్ణాట‌క‌కు చెందిన 6 మంది సభ్యులు గ‌ల ముఠాను ఆరెస్ట్ చేయ‌డంతో ఆస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని జిల్లా ఎస్పీ పి.హెచ్‌.డి రామకృష్ణ తెలిపారు.గురువారం స్దానిక ఉమేష్‌చంద్ర‌కాన్ప‌రెన్స్ సమావేశం మందిరంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ బుధ‌వారం అందిన స‌మాచారంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది,పొద‌ల‌కూరు,వెంక‌టాచ‌లం,కావ‌లిరూర‌ల్ పోలీసులు సంయుక్తంగా ఏక‌కాలంలో నిర్వ‌హించిన దాడుల్లో 6 మంది అంత‌ర్‌రాష్ట్ర స్మ‌గ‌ర్లను ఆరెస్ట్ చేయ‌డంతో పాటు వారి వ‌ద్ద నుండి 5 తుపాకులు,35 ఎర్ర‌చందనం దుంగలు,1 లారీ,2 కార్లు,800 గ్రాముల బంగారం,30 తూటాలు,8 సెల్‌ఫోన్స్‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.త‌మిళ‌నాడు సేలం జిల్లా,అత్తూరు తాలుక సెంబేరి గ్రామంకు చెందిన రాజేంద్ర‌న్‌బాలాజీ,క‌ర్ణాట‌కు చెందిన ఎస్‌.ఎం.ర‌వి,ఎస్‌.ఎం.వెంక‌ట‌రాజు,మంజూనాథ్‌,గ‌జేంద్ర‌,న‌వీన్‌లు ఒక గ్యాంగ్‌గా ఏర్పాడి నెల్లూరు,క‌డ‌ప‌,జిల్లాలో ఎర్ర‌చందనంను ఆక్ర‌మంగా స్దానిక స్మ‌గ‌ర్ల వ‌ద్ద కొనుగోలు చేస్తు,వాటిని ర‌వాణాచేస్తుంటార‌న్నార‌న్నారు.ఇదే ప‌ద్ద‌తిలో కొనుగొలు చేసే స్మ‌గ‌ర్ల స‌మాచారం ర‌హ‌స్యంగా సేక‌రించి,ఎర్ర‌చంద‌నం త‌ర‌లించే వాహానాల‌ను మార్గం మధ్యంలో అడ్డుకొని తుపాకులు చూపించి బెదిరించి,ఎర్ర‌చంద‌నం వాహానాలను హైజ‌క్ చేయ‌డం,సంద‌ర్బంను ప‌ట్టి కాల్పులు జ‌ర‌పాల్ప‌డుతుంట‌ర‌న్నా తెలిపారు.ఇలాంటి గ్యాంగ్‌ల మ‌ధ్య గ్యాంగ్ వార్ జ‌రుగుతుంద‌న్నారు.స్మ‌గ‌ర్ల‌ను పోలీసులు ప‌ట్టుకొనే స‌మ‌యంలో వారు తుపాకులు చూపించి బెరించి కాల్పులు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నించార‌న్నారు.పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి,వీరి ఆరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.ఇత‌ర గ్యాంగుల ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.ఈ స‌మావేశంలో క్రైమ్ ఓఎస్డీ విఠ‌లేశ్వ‌ర్‌రావు,ఎఎస్పీ శ‌ర‌త్‌బాబులు పాల్గొన్నారు.

LEAVE A REPLY