నెల్లూరు ప‌ట్ట‌ణంలో పోలీసు స్టేష‌న్స్ పేర్లు,ప‌రిధులు మార్పు-ఎస్పీ

0
127

నెల్లూరుః నెల్లూరు జిల్లాలో భౌగోళికంగా కొన్నిపోలీస్ స్టేషన్ పరిధులు వేరే పోలీస్ స్టేషన్ పరిధి లోకి తీసుకోనిరావటం మరియు పోలీస్ స్టేషన్ ల పేర్లు మార్పులు చేయటం జరిగినదని జిల్లా ఎస్పీ పి.హెచ్‌డి రామ‌కృష్ణ ఆదివారం తెలిపారు.అయ‌న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ జి.ఓ. నెం.48 తేది : 12.04.2018 మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొదటిగా నెల్లూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌గా మార్పు చేయటం జరిగినది.ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కొత్తగా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న పుత్తా ఎస్టేట్,పరమేశ్వరినగర్,రాజీవ్ గృహకల్ప చేర్చడం జరిగినది మరియు నెల్లూరు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్.టి.సి.బస్సు స్టాండ్,ఫతేఖాన్ పేట, అరవింద్ నగర్,జూబ్లి హాస్పిటల్,మద్రాస్ బస్సు స్టాండ్,ముత్తుకురు బస్సు స్టాండ్ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చడం జరిగినది.నెల్లూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను నవాబుపేట పోలీస్ స్టేషన్‌గా పేరు మార్పు చేయటం జరిగినది.ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంకటేశ్వరపురం,జనార్ధనరెడ్డి కాలనీ,పరమేశ్వరి నగర్ చేర్చడం జరిగినది.నెల్లూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంతపేట పోలీస్ స్టేషన్‌గా పేరు మార్చటం జరిగినది.ఈ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నగాంధీ గిరిజన కాలనీ చేర్చడం జరిగినది.నెల్లూరు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌గా పేరు మార్చడం జరిగినది.ఈ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వున్న బారాషాహిద్,కలెక్టర్ బంగ్లా, DKW కాలేజీ,న్యూ జిల్లా పోలీస్ కార్యాలయము చేర్చడం జరిగినది.నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రగతినగర్,గవర్నమెంట్ హాస్పిటల్, రాజరాజేశ్వరి టెంపుల్, ఏ.సి. స్టేడియం, పోలీస్ కాలనీ,రెవిన్యూ కాలనీ,జ్యుడిషియల్ క్వార్టర్స్,జెడ్.పి కాలనీ, పోస్టల్ కాలనీ,ఎస్.డి.పి.ఓ. నెల్లూరు టౌన్ ఆఫీస్ చేర్చడం జరిగినది.నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను వేదయపాలెం పోలీస్ స్టేషన్‌గా పేరు మార్చడం జరిగినది.ఈ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొత్తూరు,అంబాపురం చేర్చడం జరిగినది.నెల్లూరు 6వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్‌గా పేరు మార్చడం జరిగినది.ఈ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామలింగాపురం,హరనాధపురం,టి.డి.పి.ఆఫీస్, ముత్యలపాలెం,నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ చేర్చడం జరిగినది.పైన కనబరచిన మార్పులు 17.05.2018వ తేది నుండి అమలు లోనికి వస్తాయని ఈ మార్పులను ప్రజలు గమనించ వలసిందిగా పత్రిక ముఖంగా తెలియ చేయటం జరిగినది.

LEAVE A REPLY