ఎర్ర‌చంద‌నం స్మ‌గ‌ర్స్ ఆరెస్ట్‌-ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

0
162

నెల్లూరుః ఎర్ర‌చంద‌నం దొంగ‌లు జిల్లాలో రెచ్చిపోతున్నారు.దుంగ‌ల‌ను రవాణా చేసే స‌మ‌యంలో పోలీసు అడ్డ‌కుంటే వారిపై రాళ్ల‌తో దాడులు,వాహ‌న‌లతో తొక్కించేందుకు సైతం వెన‌క‌డ‌డంలేదు.ఈ నేప‌థ్యంలో ఎఏస్పీ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి బుధవారం స్దానిక ఉమేష్‌చంద్ర స‌మావేశ మందింర‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డిస్తు,మంగ‌ళ‌వారం రాత్రి నెల్లూరు జిల్లా ప‌రిధిలోని వెలుగొండ అట‌వీ ప్రాంతం నుండి ఎర్ర‌చంద‌నం ఆక్ర‌మ‌ణ ర‌వాణా జ‌రుగుతుంద‌న్న స‌మాచారంతో దాడులు నిర్వ‌హించమ‌న్నారు.ఈ దాడుల్లో 29 మంది ఆంతరాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్లు,80 లక్షలు విలువైన ఎర్ర చందనం దుంగలు మరియు వాహనాలు స్వాదీనం చేసుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.పోలీసులు దాడులు నిర్వ‌హించే స‌మ‌యంలో స్మ‌గ‌ర్స్ వాహ‌న‌ల‌తో పోలీసును గుద్దించేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు.23 మంది త‌మిళ‌నాడుకు చెందిన వారు,కేర‌ళ‌కు చెందిన ఒక‌రు,నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్య‌క్తి వున్న‌ర‌ని,వీరి వ‌ద్ద నుండి 23 సెల్‌ఫోన్స్,కొంత న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌మ‌న్నారు.

LEAVE A REPLY