7 మంది ఎర్ర‌చంద‌నం స్మ‌గ‌ర్లు అరెస్ట్‌-80 ల‌క్ష‌ల విలువైన ఎర్ర‌చంద‌నం,వాహనాలు స్వాధీనం

0
153

నెల్లూరుః నెల్లూరు జిల్లాలోని మ‌నుబోలు,దొర‌వారిస‌త్రం,పెళ్ల‌కూరు పోలీసుస్టేష‌న్స్ ప‌రిధిలో ఏకకాలంలో దాడులు నిర్వ‌హించి 7మంది జాతీయ‌,అంత‌రాష్ట్ర ఎర్ర‌చంద‌నం స్మ‌గ‌ర్ల్స్‌ను అరెస్ట్ చేసి 80 ల‌క్ష‌ల విలువ చేసే ఎర్ర‌చంద‌నం,వాహ‌నాలు స్వాధీనం చేసుకొవ‌డం జ‌రిగిద‌ని నెల్లూరు జిల్లా క్రైమ్ ఓఎస్డీ విఠ‌లేశ్వ‌రావు చెప్పారు.గురువారం గూడూరు రూర‌ల్ పోలీసు స్టేష‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ 1,జ‌గ్న‌నాధ్‌మోహ‌న్‌రాజ్ (34) చెన్నై,2,బాలురీగ‌న్ (37) చెన్నై,3.శ్రీరాములుగోవింద‌స్వామి (26) చెన్నై ,4.సుభాష్‌(26) హ‌ర్యానా,5.ఏరోస‌న్ ఏళంగో (36) త‌మిళ‌నాడు, 6.ఎం.విజ‌య్‌(18) చిత్తూరు,7.గుండం.మ‌ణి(18) చిత్తూరుల‌ను ఆరెస్ట్ ఆదుపులోకి తీసుకుని వీరి నుండి 41 ఎర్ర‌చంద‌నం దుంగ‌లు,రెండుకార్లు,ఒక ట్ర‌క్కుఆటో,9 సెల్‌ఫోన్‌లు,3500రూ న‌గ‌దును స్వాదీనం చేసుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.వీరంత వెలిగొండ అడ‌వుల్లో ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను త‌యారుచేయించి చెన్నైకి త‌ర‌లిస్తార‌ని,పోలీసులు దాడులు చేస్తున్న స‌మ‌యంలో,స్మ‌గ‌ర్లు వాహ‌నాల‌తో పోలీసుల‌ను గుద్ది చంప‌డానికి ప్ర‌య‌త్నించార‌న్నారు.వీరీతో సంబంధం వున్న వారి కోసం 3 ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మ‌రియు మ‌నోబోలు,దొర‌వారిస‌త్రం,పెళ్ల‌కూరు ఎస్‌.ఐలు జెపి.శ్రీనివాస‌రెడ్డి,కోటిరెడ్డి,హ‌నీఫ్‌లు వారి సిబ్బంది పాల్గొన్నారన్నారు.

LEAVE A REPLY