దొపిడి ముఠా దొంగ‌లు ఆరెస్ట్‌-డిస్పీ ముర‌ళీకృష్ణ‌

0
152

నెల్లూరుః గ‌త కొంత‌కాలంగా నెల్లూరు సిటి,రూర‌ల్ ప్రాంతాల్లో ఆర్ద‌రాత్రి స‌మ‌యంలో రోడ్ల‌పై ప్ర‌యాణీకుల‌ను అపి వారి వ‌ద్ద నుండి డ‌బ్బులు,సెల్‌ఫోన్‌లు లాక్కొంటూ,ప్ర‌తిఘ‌టించిన వారిపై దాడులకు పాల్ప‌ప‌డి దొపిడిలు చేస్తున్న 10 మంది స‌భ్యుల ముఠాను అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌ని నెల్లూరు టౌన్‌డిస్పీ ముర‌ళీకృష్ణ తెలిపారు.సోమ‌వారం 2వ ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వారిలో 8 మంది మైనర్లు కాగా,2 మాత్రం మేజ‌ర్ల‌న్నారు.వీరి వ‌ద్ద నుండి 7 ద్విచ‌క్ర‌వాహ‌నాలు,6200 రూ.న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌మ‌న్నారు.ఆరెస్ట్ అయిన వారిలో 16 నుండి 19 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌ల్గిన వీరంత నెల్లూరు న‌గ‌రంలోని కిసాన్‌న‌గ‌ర్‌,బాలాజీన‌గ‌ర్‌,బి. వి.న‌గ‌ర్‌,పొద‌ల‌కూరురోడ్డు,కొట‌మిట్ట‌, సంత‌పేట‌,బోడిగాడితోట‌,ఎన్‌.టి.ఆర్ న‌గ‌ర్‌,వేంక‌టేశ్వ‌ర‌పురం ప్రాంతాల‌కు చెందిన వారిగా గుర్తిచండం జ‌రిగింద‌న్నారు. వీరు ముఠాగా ఏర్ప‌డి ఆర్ద‌రాత్రి వేళ రైల్వేస్టేష‌న్‌,బాస్టాండ్‌ల వ‌ద్ద ఇత‌ర ప‌నుల‌పై వెళ్లే ప్ర‌యాణిక‌లను అడ్డ‌గించి,కొట్టి భయ‌బ్రాంతుల‌కు గురిచేసి వారి వ‌ద్ద నుండి విలువైన సెల్‌ఫోన్‌లు డ‌బ్బులు దొచుకునే వార‌ని,డ‌బ్బులు అవ‌స‌రం అయినప్ప‌డు ఇదే త‌ర‌హా దొపిడిల‌కు పాల్ప‌ప‌డేవార‌న్నారు.అలాగే ఆదివారం నాడు మైపాడుగేట్ స‌మీపంలో 40 వేల రూపాయ‌ల విలువ‌చేసి గుట్కాప్యాకెట్స్‌ను స్వాధీనం చేసుకుని,జి.క‌ళ్యాణ్‌కుమార్ అనే వ్య‌క్తిని ఆరెస్ట్ చేసి,కేసును ద‌ర్య‌ప్తు చేస్తున్న‌మ‌న్నారు.

LEAVE A REPLY