జిల్లా పార్థి గ్యాంగ్ సంచ‌రించే ఆవ‌కాశం-ప్ర‌జ‌లు ఆప్ర‌మ‌త్తంగా వుండాలి-డిస్పీ రాంబాబు

0
354

నెల్లూరుః ఉత్త‌ర భార‌త‌దేశంకు సంబంధించి పార్థిగ్యాంగ్ జిల్లాలో సంచరిస్తుందని,చిత్తూరు జిల్లాలో సంచరిస్తుందని వార్త‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో జిల్లా ఎస్పీ పి.హెచ్‌.డి.రామకృష్ణ,పోలీసుశాఖ‌ అప్రమత్తం వుండాల‌ని ఆదేశాలు జారీ చేశార‌ని గూడూరు డిఎస్పీ రాంబాబు తెలిపారు. రాత్రి వేళలో పోలీస్ గస్తీని తీవ్రతరం చేయాలని,అన్ని కాలనీలలో ప్రజలను అప్రమత్తం చేయాలని,పార్థి గ్యాంగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పోలీసులను ఆదేశించారన్నారు.ఇప్పటి వరకు బెంగళూరు,మహారాష్ట్రల్లో దోపిడీలకు పాల్పడ్డ పార్థి గ్యాంగు తాజాగా చిత్తూరు జిల్లాలో సంచరిస్తుందనటానికి ఆధారాలు లభించాయి.ఈ గ్యాంగ్ లో 5-6 or 8-10 సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్ ఇళ్లే ఈ గ్యాంగ్ టార్గెట్ అని తెలుస్తుంది.ముఖ్యంగా నిర్మానుషమైన కాలనీలలో, కాలనీలోని చిట్టచివరి తాళం వేసిఉన్న లేదా ఇంట్లో జనాలు ఉన్నప్పటికి డబ్బున్న వారి ఇళ్లను గుర్తించి దోపిడీ చేస్తారు.శరీరానికి ఒండ్రు మట్టి గాని లేడా నూనె రాసుకుని సంచరిస్తారు.
పగలు కుర్తా మరియు లుంగీ ధరిస్తారు.వీరు రైల్వే స్టేషను, బస్సు స్టాండ్ దగ్గరలో చింత చెట్ల క్రింద గుడారలలో లేదా కాలనీలలో ఉన్న కాలీ ప్లాట్లలో బస చెస్తారు.పగలు బిచ్చగాళ్లలాగా లేదా కూలీలలాగా లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నట్లు నటిస్తూ కాలనీలలో సంచరిస్తూ తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిళ్ళు దోపిడి చెస్తారు. వీరి వద్ద వారి ఆరాధ్య దైవమైన అమ్మవారి ప్రతిమ ను ఉంచుకొని ఉంటారు.
ఒకేరాత్రి 2 – 4 ఇళ్లను దోచుకుంటారు.ఇంట్లో సభ్యులు ఉండగా కిటికీ రెక్కలు బలవంతంగా తెరిచి, Grill కి చెందిన Screw లను విప్పి వాటిని తొలగించి చాకచక్యంగా లోనికి ప్రవేశించి ఇంట్లో బీరువా తాళం సంపాదించి బీరువా తెరిచి విలువైన వస్తువులను దోచుకుంటారు. ఆ సమయములోమేల్కొంటే వారిపై తీవ్రంగా దాడులు జరిపి వారిని దోచుకుంటారు.ఒకవేళ ఇంటి సబ్యులు వుంటే వాటిని కట్టిపడేస్తారు, ఎదురుతిరిగితే చంపడానికి కూడ వెనుకాడరు.వీరు సహజంగా కత్తులు, రాడ్లు, బ్లేడ్లు మరియు తుపాకులు కలిగి ఉంటారు.వీరు కొన్ని సార్లు దోపిడీచేసిన ఇంట్లో భొజనం చేసి అక్కడే మల విసర్జన చేసి వెళ్తారు.వీరు కొన్నిసార్లు గుడులలో కూడా దోపిడి చేశారు.వీరు ఫాసే పార్థి అనే తెగకు చెందినవారు, ఈ తెగలు మహారాష్ట్రలో మరియు మద్యప్రదేశ్ లో కనబడుతాయి.ఈ తెగకు చెందిన వారు 1999వ సంవత్సరం నుండి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ మరియు ఆంద్ర ప్రదెశ్లలో దోపిడీలు చెసారు.వీరు ఇంతవరకు చాలా తక్కువగా పట్టుబడ్డారు, చివరిసారి ముంబయి పోలీసు 8 Feb 2016 ముంబై లోని బోరవెల్లి లో వీరి పై కాల్పులు జరిపి అరెస్ట్ చెసారు .
పోలీసులు తీసుకోవలసిన జాగ్రత్తలు:-
Out skirts Isolated Houses లను గుర్తించి బీట్లు వేయుట.Railway Stations/Bus Stands వద్ద నిఘా పెంచడం.వాహన తనిఖీలు ముమ్మరం చేయుడం.Out skirts లందు గుడారాలు వేసుకొని అనుమానస్పదముగా బస చేసియున్నవారిని అదుపులో తీసుకొని Interrogate చేసి Finger Prints తీసుకొవాలి.మీ లోకల్ కేబుల్స్ ద్వారా ప్రజలకు అవగాహనా క‌ల్పించే విధంగా తగు జాగ్రత్తలను తీసుకొవాల‌ని సూచించడడం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY