లారీ బ్యాట‌రీల దొంగ ఆరెస్ట్‌

0
118

నెల్లూరుః లారీలో క్లీన‌ర్‌గా ప‌నిచేస్తున ఎస్‌.కె.మ‌స్తాన్ అనే వ్య‌క్తి అదే లారీని తీసుకుని వెళ్లి,లారీలో వున్న 2 బ్యాట‌రీల‌ను దొంగ‌లించాడ‌ని క్ర్రైమ్ ఓఎస్డీ విఠ‌లేశ్వ‌ర్ తెలిపారు.శుక్ర‌వారం స్దానిక రూర‌ల్ పోలీసు స్టేష‌న్‌లో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో అయ‌న మాట్లాడుతూ నాయుడుపేట‌కు చెందిన సుధాక‌ర్ లారీని ఇందుకూరుపేట‌లో ఆర‌టి ఆకుల లోడ్ కోసం బాడుగ‌కు డ్తైవ‌ర్ ఎస్‌.కె.బిక్కిమస్తాన్‌,క్లీన‌ర్ మస్తాన్‌ను గ‌త 25వ తేదిన పంపించ‌డం జ‌రిగింద‌న్నారు.లారీ డ్తైవ‌ర్ భోజ‌నం చేసి వచ్చేలోపు క్లీన‌ర్ లారీతో ప‌రారీ అయి,అందులోని బ్యాట‌రీల‌ను దొంగ‌లించి,ఎన్‌.టి.ఆర్ న‌గ‌ర్ పెట్రోల్ బంకు వ‌ద్ద లారీని వ‌దిలి ప‌రారీ అయ్యాడ‌న్నారు. సి.ఐ శ్రీనివాసుల‌రెడ్డి,ఆధ్వ‌ర్యంలో పోలీసు సిబ్బంది గురువారం మ‌స్తాన్‌ను అదుపులోకి తీసుకొని లారీని,అందులోని బ్యాట‌రీల‌ను స్వాధీనం చేసుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY