అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడైన అవ్వా సీతారామారావు అరెస్ట్‌?

0
146

అమ‌రావ‌తిః అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడైన అవ్వా సీతారామారావును సీఐడీ పోలీసులు దిల్లీలో అరెస్ట్ చేసినట్లు స‌మాచారం. సీతారాం గతంలో అగ్రిగోల్డ్ కు డైరక్టర్‌గా వ్యవహరించాడు.కంపెనీ లావాదేవీలను తెరవెనుక నుండి నడిపించేవాడు.అగ్రిగోల్డ్ పై కేసు నమోదు తర్వాత సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ముందస్తు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను సంప్రదించాడు. అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించటంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ప్రస్తుతం జైల్లో ఉన్న తనవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.అగ్రిగోల్డ్ సంస్థలను వేలంలో కొనేందుకు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూప్ సంస్థలను సీతారామారావు ప్రభావితం చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.సీఐడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీతారాంను ఎట్టకేలకు సీఐడీ పోలీసులు గూర్‌గావ్‌లో అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. నిందితుడ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై బుధ‌వారం విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్ అసలు ఆస్తులెంత? లావాదేవీలు ఎలా జరిగాయి? అనే విషయాలపై సీతారామారావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

LEAVE A REPLY