4 దొంగ‌లు ఆరెస్ట్‌-4 ల‌క్ష‌ల విలువైన బంగారు న‌గ‌లు స్వాధీనం-డిస్పీ

0
119

నెల్లూరుః ఇంటిలో నిద్రిస్తున్న మ‌హిళ‌ల మెడ నుండి బంగారు గొలుసులు దొంగ‌తనాలు చేస్తున్న 4 గురు వ్య‌క్తుల‌ను ఆరెస్ట్‌చేసి వారి వ‌ద్ద నుండి 22 స‌వ‌ర్ల బంగారు గొలుసులు,ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొవ‌డం జ‌రిగింద‌ని సెంట్ర‌ల్ క్ర్తైమ్ డిస్పీ ఎం.బాల‌సుంద‌రావు తెలిపారు.గురువారం సిసి.ఎస్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ క్త్రైమ్ సి.ఐ బాజీజాన్‌సైదా,చేజ‌ర్ల ఎస్‌.ఐ బాజీరెడ్డిలు వారి సిబ్బందిత‌తో ఇరుక‌ళ‌ప‌ర‌మేశ్వ‌రి గుడి వ‌ద్ద ఆటోలు త‌నిఖీ చేస్తున్న స‌మయంలో అనుమాన‌స్ప‌దంగా క‌నిపించిన జి.ర‌మ‌ణ‌య్య (58) సంగం,జి.వెంక‌ట‌ర‌మ‌ణ‌య్య (40),బుచ్చి,జి.ర‌మ‌ణ‌య్య (45),బుచ్చి,న‌క్కా,రంగ‌య్య (50)బుచ్చిలను అదుపులోకి తీసుకున్న ప్ర‌శ్నించగా,వారు చేసిన దొంగ‌త‌నాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌న్నారు.వీరంద‌రు బంధువుల‌ని,ముఖ్యంగా సోమ‌శిల‌,చేజ‌ర్ల‌,క‌లువాయి, ప్రాంతాల్లో ఇంటిలో నిద్రిస్తున్న మ‌హిళ‌ల మెడ నుండి బంగారు న‌గ‌లు దొంగ‌లించేవార‌న్నారు.వీరిపై 7 కేసుల వర‌కు న‌మోదు అయ్యాయ‌న్నారు.ఈ దాడుల్లో సిసిఎస్ ఎస్‌.ఐ ముర‌ళీకృష్ణ‌ప్ర‌సాద్‌,ర‌మేష్‌,హెచ్‌సిలు సురేష్‌క‌మార్‌,వెంక‌టేశ్వ‌ర్లు,రాజేష్‌,ప్రభాక‌ర్‌లకు రివార్డుల‌కు సిఫారసు చేస్తున్న‌ట్లు తెలిపారు.

LEAVE A REPLY