ఆజ్ఞాత‌వాసిలో గొంతు స‌వ‌రించిన ప‌వ‌న్‌

0
125

అమ‌రావ‌తిః పవన్ స్వయంగా మరోసారి తన గాత్రం ఆజ్ఞాత‌వాసి సినిమాలో సవరించడంతో అభిమానులు సంబ‌రాలు చేసుకునేందుకు సిద్దంమౌవుతున్నారు.పవన్ క‌ళ్యాణ్‌ పాటకు సంబంధించి చిత్ర యూనిట్ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసింది. ఆ ఫోటోల్లో గీత రచయిత భాస్కర భట్ల కూడా ఉన్నారు.అజ్ఞాతవాసిలో పవన్‌తో పాట పాడించడం కోసం దర్శకుడు త్రివిక్రమ్,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో క‌ళ్యాణ్‌ కూడా పాటకు ఓకె చెప్పినట్లు సమాచారం. ఫోటోల్లో పవన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే మరోసారి పాట ఇరగదీసినట్లే అనిపిస్తోంది.అయ‌న‌తో పాట పాడించారంటే కచ్చితంగా మాస్ సాంగే అయి ఉంటుందని,తాజాగా ‘చిత్రయూనిట్..కొడుకా.కోటేశ్వ‌రావు అంటూ లిరిక్స్ లీక్ చేయడంతో.. ఇది కచ్చితంగా మాస్ సాంగే అన్న అభిప్రాయం అభిమానుల్లో బలపడుతుంది.డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రయూనిట్ పాటను విడుదల చేసే ఆవకాశం వున్న‌ట్లు సమాచారం? నిజానికి తొలి నుంచి దీనిపై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చిన చిత్ర యూనిట్.. పవన్ సాంగ్ ఉందని ప్రకటించి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది.డిసెంబర్ 26న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

LEAVE A REPLY