వ‌క్ర‌బుద్దిని మార్చుకోని పాకిస్తాన్‌-చొర‌బాటుకు 450 మంది

0
34

అమ‌రావ‌తిః ఏన్ని విధాల చెప్పిన పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్దిని మార్చుకోనంటుంది.ఏదో విధంగా భార‌త్‌లో హింస‌ను ప్రేరేపించేందుకు జమ్ముకశ్మీర్ నుండి చొరబడేందుకు నియంత్రణ రేఖ దగ్గర ఉన్న వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాక్ టెర్రరిస్టులు వేచి చూస్తున్నారని ఇంటెలిజెన్స్ తన తాజా నివేదికలో హెచ్చరించింది.సరిహద్దుల వద్ద ఉన్నవారిలో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొంది.జూన్ 28 నుంచి కొనసాగే అమర్ నాథ్ యాత్రను వీరు టార్గెట్ చేశారని తెలిపింది.రంజాన్ మాసం సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక దాడులకు భారత్ విరామం ప్రకటించడం తీవ్రవాదులకు కలిసొచ్చిందని, కొత్త రిక్రూట్ మెంట్లను చేసుకోవడంతో పాటు,ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా తిరిగి కలిసేందుకు వారికి సరైనంత సమయం దొరికిందని తెలిపింది.ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ దళాలు మోహరించాయని,భారత్ లోకి చొరబడేందుకు టెర్రరిస్టుల కొత్త బ్యాచ్‌లు ఎదురు చూస్తున్నాయని హోంశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.ఏయే లాంచ్ ప్యాడ్ వద్ద ఎంత మంది టెర్రరిస్టులు ఉన్నారంటేః-గురేజ్ సెక్టార్-20 మంది,,మాచిల్ సెక్టార్-50,,కేరన్ సెక్టార్-55,,తంగ్ధార్ సెక్టార్-66,,నౌగామ్ సెక్టర్-7,,యూరి సెక్టార్-50,,పూంచ్ సెక్టర్-35,,భింభర్ సెక్టార్-120,,నౌషేరా సెక్టార్-30,,రాంపూర్ సెక్టార్-30 మంది ఉన్న‌ట్లు తెలిపింది.

LEAVE A REPLY