సింహ‌పురి ఆసుప‌త్రిలో రూర‌ల్ ఎమ్మేల్యే మీడియా స‌మావేశం ?

కార్పొరేట్ హాస్ప‌ట‌లా,,,, మ‌జాకా ?నెల్లూరుః కావ‌లి స‌బ్ క‌లెక్ట‌ర్ విచార‌ణ నిర్వ‌హించి ఇచ్చిన నివేదిక ప్ర‌కారం,త‌ప్పు జ‌రిగింది ? అని భావిస్తున్నసింహ‌పురి కార్పొరేట్ ఆసుప‌త్రిని నెల్లూరు రూర‌ల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధ‌ర్‌రెడ్డి ఆదివారం సంద‌ర్శించ‌డం,,అదే ఆసుప‌త్రిలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి,, గ‌త 3 సంవ‌త్స‌రాలుగా నెల్లూరులో వివిధ హ‌స్ప‌ట‌ల్స్‌లో జ‌రిగిన ఆవ‌య‌వ‌దాన‌ల‌పై పూర్తి స్థాయిలో సి.ఐ.డి విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేయ‌డం ఏమ‌ట‌న్న ప్ర‌శ్న న‌గ‌ర ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు దారీతీసింది.కార్పొరేట్ ఆసుప‌త్రిలో పేద‌ల‌కు ఆన్యాయం జ‌రిగితే రాజ‌కీయ నాయ‌కులు స‌ద‌రు ఆసుప‌త్రి ముందు ధ‌ర్నా లేక నిర‌స‌న తెలియచేయ‌డం సర్వ‌సాధ‌ర‌ణంగా చూస్తున్నాం.ఒక వేళ బాధిత పేద‌ల‌కు న్యాయం చేయ‌లంటు ఎమ్మేల్యే కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డం లేదా జిల్లా క‌లెక్ట‌ర్‌కు వినతి ప‌త్రం ఇవ్వ‌డం లేదా సంబంధిత శాఖ ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీకి లేఖ రాయ‌డం జ‌రుగుతుంది.ఆదివారం రూర‌ల్ ఎమ్మేల్యే సింహ‌పురి కార్పొరేట్ ఆసుప‌త్రిలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశం ????
సి.ఇ.ఓ హ‌రికృష్ణః-త‌మ వాద‌న విన్పించేందుకు ఆవ‌కాశం క‌లిగిందంటు మ్యాక్సీకూబ్ గ్రూప్ హ‌స్ప‌ట‌ల్స్ సి.ఇ.ఓ హ‌రికృష్ణ మాట్లాడ‌డం విచిత్రంగా క‌న్పిస్తుంది.ఒక వేళ సింహ‌పురి ఆసుప‌త్రికి సంబంధించి జ‌రిగిన ఘ‌ట‌న‌పై వారి వాద‌న విన్పించాలి అనుకుంటే,సింహ‌పురి ఆసుప‌త్రి వర్గాలు మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ము అంటు మీడియా ప్ర‌తినిధుల‌కు తెలియ‌చేస్తే,,,ఖ‌చ్చితంగా మీడియా ప్ర‌తినిధులు హాజ‌రై,,ఆసుప‌త్రి వ‌ర్గాల వాద‌న ప్ర‌జ‌ల‌కు తెలియ చేస్తుంది…తాను 20 సంవ‌త్స‌రాల నుండి డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ను, అన్న హైద‌రాబాద్ బేస్డ్ గ్రూప్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ సి.ఇ.ఓకు తెలియ‌దా ??
రూర‌ల్ ఎమ్మేల్యేః- ప్ర‌స్తుత్తం సింహ‌పురి హ‌స్ప‌ట‌ల్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు,వాటిపై జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు తెర‌దించేందుకు రూర‌ల్ ఎమ్మేల్యేగా త‌న వంతు ప్ర‌య‌త్నంలో బాగంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వైసిపి నెల్లూరు రూర‌ల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధ‌ర్‌రెడ్డి తెలిపారు.నిష్ణ‌తులైన డాక్ట‌ర్ల చేత పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపి,, త‌ప్పు జ‌రిగి వుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,అన్ని స‌క్ర‌మంగా జ‌రిగి వుంటే సింహ‌పురి హాస్ప‌ట‌ల్‌కు క్లీన్ చిట్ ఇవ్వాల‌ని కోరారు.