కొత్త త‌రం గేమింగ్ ఫోన్ భార‌త్ మార్కెట్‌లో

అమ‌రావ‌తిః మొబైల్‌ఫోన్‌లో గేమ్స్ అడుకునే గేమింగ్ ప్రియుల‌కు కొత్త త‌రం గేమింగ్ ఫోన్‌ను చైనాకు చెందిన నుబియా భారత్‌లో రెడ్‌మ్యాజిక్‌ 3 పేరుతో ప్రపంచంలోనే తొలిసారిగా యాక్టివ్‌ కూలింగ్‌ వ్యవస్థతో కూడిన గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. గేమింగ్‌ సమయంలో ఫోన్‌లో ఉత్పన్నమయ్యే వేడిని బయటకు పంపి చల్లబరిచేందుకు అంతర్గతంగా ఫ్యాన్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో గేమ్‌బూస్ట్‌ బటన్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్, 6.65 అంగుళాల అల్ట్రా వైడ్‌ స్క్రీన్, 90హెచ్‌జెడ్‌ రీఫ్రెష్‌ రేట్‌తోకూడిన అమోలెడ్‌ డిస్‌ప్లే, 4డీ వైబ్రేషన్, ముందు భాగంలో రెండు స్టీరియో స్పీకర్లు, 27వాట్ల క్విక్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకాలు మొదలవుతాయని, ధర రూ.35,999గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది.