ధర్మ పోరాట దీక్ష పేరుతో తెరపైకి కొత్త డ్రామాలు-జ‌న‌సేనాని

0
78

ఒక్కరోజు ఎమ్మెల్యేగా.
శ్రీకాకుళంః పలాసలో రాత్రి సమయంలో తాను విడిది చేసిన కళ్యాణ మండపంలో కరెంట్ తీసి తనపై దాడికి కొంత మంది కిరాయి గూండాలు దాడికి ప్రయత్నించారని,అలాంటి వారు వస్తే బట్టలు ఊడదీసి కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.బుధ‌వారం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కిలో అంబేద్క‌ర్ జంక్ష‌న్ నుండి ఇందిరా భ‌వ‌న్ జంక్ష‌న్ వర‌కు నిర్వ‌హించిన నిర‌స‌న కవాతులో పాల్గొన్న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అయ‌న అవేశంగా మాట్లాడుతూ విభజన నుంచి ప్రత్యేక హోదా వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అన్నింటిని విస్మరించారని ధ్వజమెత్తారు. అంతేకాదు, తనపై కొందరు కిరాయి రౌడీలు రాత్రిపూట దాడికి ప్రయత్నించారని,అలాంటి వాటిపై ఊరుకునే సమస్యే లేదని హెచ్చరించారు.
ప్రత్యేక హోదా విషయంలో జనసేన మొదటి నుంచి ఓకే వైఖరితో ఉందని చెప్పారు.ఆ రోజు తమతో కలిసి చంద్రబాబు గొంతు కలిపి ఉంటే హోదా వచ్చి ఉండేదన్నారు.ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచింది రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులనే ఏపీలోని టీడీపీ,కేంద్రంలోని బీజేపీ పునరావృతం చేస్తున్నాయని మండిపడ్డారు.2019లో సరికొత్త రాజకీయ వ్యవస్థ అవసరమన్నారు. జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. సామాజిక రాజకీయ మార్పు కావాలని చెప్పారు.తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, ప్రజలకు న్యాయం చేయక పోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయిందని పవన్ ఎద్దేవా చేశారు.ఆ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చుకోవద్దని హితవు పలికారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటామంటే ఇక్కడా అదే పరిస్థితి దాపురిస్తుందన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు మాట మార్చి,ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష పేరుతో తెరపైకి కొత్త డ్రామాలు తీసుకు వస్తున్నర‌ని, చంద్రబాబు సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
ఒక్కరోజు ఎమ్మెల్యేగాః- ఒక్కగంట ముఖ్యమంత్రిగా, ఒక్కరోజు ఎంపీగా ఉన్న వాళ్లెవరైనా రిటైర్‌ అయితే వాళ్లకు జీవితకాలం పెన్షన్‌ వస్తోందన్నారు.ఇక్కడ ఉద్యోగులు ముప్పై ఏళ్లు పని చేసినా గానీ ఈ స్కీమ్‌తో వాళ్లకు పెన్షన్‌ వచ్చే ఆధారాన్ని భయాందోళనలోకి నెట్టేశారన్నారు.వారిని పట్టించుకొనే నాథుడు లేరని,వాళ్ల కోసం పోరాటం చేస్తానని, మత్స్యకారుల జీవిత ప్రమాణాలను పెరిగే వరకు జనసేన వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ఉద్ధానం కిడ్నీ సమస్యపై దృష్టి పెట్టడంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY