నెల్లూరు జిల్లాలో 26 వేల ఏక‌రాల్లో ప్ర‌కృతి సేద్యం జ‌రుగుతుంది-రాజ‌శేఖ‌ర్‌

నెల్లూరుః వ్య‌వసాయ‌రంగంలో కొత్త‌దనానికి ప్రాధాన్య‌త‌నిస్తూ,సాగుచేయ‌డంతో పాటు వినియోగదారునికి క‌ల్తీలేని ఆహాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా వుంద‌ని వ్యవ‌సాయ‌శాఖ స్పెష‌ల్‌చీఫ్ సెక్ర‌టరి రాజ‌శేఖ‌ర్ పెర్కొన్నారు.సోమ‌వారం స్థానిక ప‌ర‌మేశ్వ‌రి క‌ళ్యాణ‌మండంలో వ్యవ‌సాయ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఖ‌రీఫ్ 2019లో అమ‌లు చేయ‌వ‌ల‌సిన వివిధ ప‌థ‌కాల‌పై M.P.E.Oల నుండి జె.డి స్థాయి వ‌ర‌కు అధికారుల‌కు జిల్లా స్థాయి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో అయ‌న ముఖ్య అతిధిగా పాల్గొన్న సంద‌ర్బంలో మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఎంత‌రైన వుంద‌ని,భావిత‌రాల‌కు మంచి కాలుష్య‌ర‌హిత వాతావ‌ర‌ణాన్ని అందించాల్సి వుంద‌న్నారు.గ్రీన్‌హౌస్ గ్యాసెస్ ఎమిష‌న్ ద్వారా ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త దెబ్బ‌తింటుంద‌న్నారు. నెల్లూరు జిల్లాలో 26 వేల ఏక‌రాల్లో ప్ర‌కృతి సేద్యం చేస్తున్నర‌ని,భ‌విష్య‌త్‌లో మ‌రింత శాతం పెంచాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు. వ్య‌వసాయ‌శాఖ క‌మీష‌న‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వ‌ర‌కు 6 జిల్లాలో ఒక్క‌రోజు ఆవ‌గాహ‌న స‌ద‌స్సులు పూర్తి అయ్యాయ‌ని,నెల్లూరు స‌ద‌స్సు 7వద‌ని, వీడియో కాన్ప‌రెన్స్‌లో,టెలికాన్ప‌రెన్స్‌లో కాకుండా నేరుగా క్షేత్ర‌స్తాయిలో వ్య‌వసాయ సిబ్బందితో చ‌ర్చించ‌డం వారి వ‌ద్ద నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవ‌డ‌మే స‌ద‌స్సు ముఖ్యోధేశ్య‌మ‌న్నారు.అవ‌గాహ‌న స‌ద‌స్సులో లేవ‌నెత్తిన ప‌లు అంశాల‌పై కూలంక‌షంగా చ‌ర్చించి అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు సూచించారు.ఈకార్య‌క్ర‌మంలో జె.డి స‌త్యనారాయ‌ణ‌,సైంటిస్ట్ డా.సంధ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.