అసలైన పండగ కోసం నేను కూడా నిరీక్షిస్తున్నాను.

0
71

అమ‌రావ‌తిః 2018 కొత్త సంవత్సర వేడుకలకూ దూరంగానే ఉంటానని, మన సామాజిక వర్గాలు ఆశించిన మేరకు రిజర్వేషన్లు పొందడమే అసలైన పండగగా భావిస్తున్నానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన మంగ‌ళ‌వారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఆ బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు బీసీ రిజర్వేషన్ ఫలాలు అందే వరకూ ఏ పండగ చేసుకోననే విషయాన్ని మరోమారు గుర్తు చేస్తున్నానని,అసలైన పండగ కోసం తాను కూడా నిరీక్షిస్తున్నానని తెలిపారు.జనవరి 1న తనను కలిసేందుకని, శుభాకాంక్షలు చెప్పేందుకని కిర్లంపూడికి వచ్చే ప్రయత్నం చేయవద్దని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు విజ్ఞప్తి చేస్తున్నానని తన ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A REPLY