తెలుగు సినిప‌రిశ్ర‌మ‌లో వివాద‌ల‌కు తెర‌.?

0
119

అమ‌రావ‌తిః ఇటీవ‌ల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వివాదాలు చోటుచేసుకుంటున్న నేప‌థ్యంతో చలన చిత్ర పరిశ్రమ పలు నిర్ణయాలు తీసుకుని బుధ‌వారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది.టాలీవుడ్‌లోకి ప్రవేశించాలనుకునే నటీనటులు కౌన్సెలింగ్‌-మార్గదర్శనం కోసం ఒక ప్యానెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.అలాగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక ప్యానెల్‌ నియమిస్తున్నట్లు,ఇందులో 50 శాతం మంది ప్రతినిధులు ఇండస్ట్రీ బయటి వ్యక్తులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.ఈ ప్యానెల్‌లో డాక్టర్లు,లాయర్లు,విశ్రాంతి ప్రభుత్వోద్యోగులు, విద్యావేత్తలు,సైకాలజిస్టులు మెంబర్లుగా ఉంటారని తెలిపింది.

LEAVE A REPLY