RRR ట్యాగ్‌తో రామ్‌చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ రాజమౌళి

0
65

అమ‌రావ‌తిః రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్‌చరణ్ నటించనున్న సినిమాను గురువారం అనౌన్స్ చేశారు. RRR ట్యాగ్‌తో రామ్‌చ‌ర‌ణ్‌ , ఎన్టీఆర్ రాజమౌళి పేర్లు వచ్చేలా సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది.డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.అక్టోబర్ నుండి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం.ఇద్దరు హీరోలు ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆర్ఆర్ఆర్’ పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు.అయితే ఇది టైటిల్ కాదని ముగ్గురి పేర్లు వచ్చేలా అనౌన్స్ చేశారట.అఫీషియల్ టైటిల్ ఫైనల్ అయ్యే వరకు ఉపయోగించే తాత్కాలిక పిలుపు మాత్రమే అని చిత్ర యూనిట్ తెలిపారు.రాజమౌళి గత చిత్రాలు తీసుకుంటే ఈగ, బాహుబలి, బాహుబలి2 చిత్రాలు భారీగా గ్రాఫిక్స్ వర్క్‌తో కూడిన సినిమాలు.అయితే ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని గ్రాఫిక్స్ జోలికి పోకుండా చిత్రీకరించాలని నిర్ణించారు రాజమౌళి.రాజమౌళి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం తెలుగు సిని ప‌రిశ్ర‌మ నుండి మరో టాప్ యాక్టర్‌ను తీసుకోబోతున్నారని, ఆయన ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్.అయితే అతడు ఎవరు?

LEAVE A REPLY