గొల్ల‌భామ అనేది ఒక పురుగు-సుకుమార్

0
137

అమ‌రావ‌తిః ఇటీవ‌ల కాలంలో సినిమాల్లో వ‌చ్చే పాట‌ల‌పై వివిధ కుల సంఘాలు స్పందించి,పాటల్లో ప‌దాలు తొల‌గించాల‌ని డిమాండ్ చేయాడం స‌ర్వ‌సాధ‌రణం అయింది.ఈనేప‌ధ్యంలో రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాపై వివాదం నెలకొంది. సినిమాలోని ‘రంగమ్మ మంగమ్మ’ అనే పాటలో ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే చరణం ఉంది. దీనిపై యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గొల్లభామ అనే పదాన్ని తొలగించాలని… లేకపోతే సినిమాను అడ్డుకుంటామంటూ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ హెచ్చరించారు. దీనిపై సుకుమార్ స్పందించాడు. గొల్లభామ అనే పదాన్ని మనుషులను ఉద్దేశించి వాడలేదని చెప్పాడు. గొల్లభామ అనేది ఒక పురుగని, దాని గురించి అందరికీ తెలిసే ఉంటుందని తెలిపాడు.

LEAVE A REPLY