మోటరోలా నూత‌న స్మార్ట్‌ఫోన్ త్వ‌ర‌లో విడుద‌ల‌!

అమ‌రావ‌తిః వ‌న్ విజన్‌ పేరుతో ను ఈ నెల 15వ తేదీన బ్రెజిల్ సావోపోలోలో జ‌ర‌గ‌నున్న ఓ ఈవెంట్‌లో మోటరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ది.ఆధునిక ఫీచర్లు,అందుబాటు ధ‌ర‌కు ఈ ఫోన్‌ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.ప్రధానంగా హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే, 48, 5 మెగా పిక్సెల్‌ సామర్ధ్యం గల డబుల్‌ రియర్‌ కెమెరా లాంటి ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తోంది. దీంతో పాటు మోటో ఈ6 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్‌ చేయనుందని సమాచారం. అయితే రిలీజ్‌కు ముందే వన్‌ విజన్‌ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో క‌న్పిస్తున్నాయి.సుమారు రూ.23,400 ఉండ‌వ‌చ్చు?*మోటరోలా వ‌న్ విజ‌న్ ఫీచ‌ర్లు**6.3 ఇంచ్ డిస్‌ప్లే**ఎగ్జినోస్ 9609 ప్రాసెస‌ర్‌**ఆండ్రాయిడ్ 9.0 **1080×2520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌**4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌**48+5 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా**25 ఎంపీ సెల్ఫీ కెమెరా**4132 ఎంఏహెచ్ బ్యాట‌రీ.