మోబిస్టార్ ఎక్స్1 నాచ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి విడుద‌ల‌

అమ‌రావ‌తిః మోబిస్టార్ స్మార్ట్ ఫోన్ అత్యంత‌ధునిక టెక్నాలాజీని వినియోగదారుల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో వుంటాయ‌ని మోడిస్టార్ కో-ఫౌండ‌ర్‌,ఇండియా సి.ఇ.ఓ కార్టో నిజో తెలిపారు.త‌మ సంస్ద త‌రపున మోబిస్టార్ తాజాగా భారత మార్కెట్లో నూతన స్మార్ట్ ఫోన్ వేరియంట్‌ను గురువారం లాంచ్ చేసింది.2 జీబీ/3 జీబీ ర్యామ్ వేరియంట్లలో ‘మోబిస్టార్ ఎక్స్1 నాచ్’ లభ్యం కానుంది. నాచ్ స్పోర్ట్స్ 5.7″ డిస్ప్లే ,13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లని కలిగి ఉన్నఈ ఫోన్ గ్రేడియంట్ షైన్, మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ అనే రంగులలో అందుబాటులో ఉండనుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.8,499 ఉండగా, 3 జీబీ ర్యామ్,32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.9,499గా ఉంది. కొత్తగా లాంచ్ చేసిన మోబిస్టార్ డివైస్ లతో జియో రూ.2200 క్యాష్ బ్యాక్ ప్రకటించింది.