పోలేరమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా వుండాలి-దేవాదాయశాఖ మంత్రి

నెల్లూరుజిల్లా : పోలేరమ్మతల్లి ఆశిస్సులతో రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాలన సుభిక్షంగా సాగాలని రాష్ట్రం అన్నివిధాల అభివృద్ది చెందాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి.శ్రీనివాసరావు,రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ కోరుకున్నారు.గురువారం వెంకటగిరి శక్తి స్వరూపిణి, శ్రీ పోలేరమ్మ జాతరలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్బంలో వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగానే లక్షాలమంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారన్నారు.ఒక వైపు వర్షం పుడుతున్నా ప్రతి ఒక్కరికి బాగా దర్శనం అయ్యాలా ఏర్పాట్లు ఇతర సౌకర్యాలు పోలీసులు,రెవెన్యూ,తదితర ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేసిందని,వారికి తన ప్రత్యేక అభినందలన్నారు.ఇటీవల రాష్ట్రంలో వర్షాలు బాగా పడ్డాయని,దింతో రాష్ట్రంలోని అన్న ప్రాజెక్టులు నీటితో నింపుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.పిలు దుర్గా ప్రసాద్, మాగుంట శ్రీనివాసులరెడ్డి,, ఎమ్మేల్యేలు రామానారాయణరెడ్డి,వరప్రసాద్ రావు,మధుసూదన్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.