ప‌ట్టు సాగుతో రైతులు ఆదాయం పెంచుకొవాలి-మంత్రులు

0
170

నెల్లూరుః జిల్లాలోని రైతులు త‌మ‌కున్న‌పొలల్లో కొంతైన సెరీక‌ల్చ‌ర్ సాగుచేయాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కోరారు.శుక్ర‌వారం నూత‌న జ‌డ్సీ స‌మావేశ మందిరంలో ఒక రోజు ప‌ట్టు రైతుల శిక్షాణ‌,ఆవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు.ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిధులుగా మంత్రులు సోమిరెడ్డి,పొంగూరులు పాల్గొన్నారు.ఒక ఎక‌ర సెరిక‌ల్చ‌ర్ సాగు చేస్తే 1,50 ల‌క్షల నుండి 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని సోమిరెడ్డి అన్నారు.దింతో ఒక ఎక‌రాకు 5 మందికి ఉపాధి క‌ల్పించే ఆవ‌కాశం ఉంటుంద‌న్నారు.సెరీకల్చ‌ర్ సాగులో చైనా త‌రువాత భార‌త‌దేశం వుంద‌ని,మ‌న దేశంలో మొద‌టి స్దానంలో క‌ర్నాట‌క‌,రెండ‌వ స్దానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వుంద‌న్నారు.త‌క్క‌వ‌నీటిని వినియోగించి మ‌ల్బ‌రిసాగు ద్వారా ఎక్కువ ఆదాయం రైతులు పొందాల‌న్నారు.ఒక రూపాయి పెట్టుబ‌డికి ప‌ట్టు ప‌రిశ్ర‌మ‌ద్వారా 3,75 రూపాయ‌లు ఆదాయంపొందే అవ‌కాశం వుంద‌న్నారు.జిల్లాలో సెరిక‌ల్చ‌ర్ సాగు చేసే రైతుల‌కు ప్ర‌భుత్వ ద్వారా త‌న‌వంతు స‌హాయ‌స‌హ‌కారాలు అందించేందుకు సిద్దంగా వున్న‌మ‌న్నారు.
మంత్రి నారాయ‌ణః- ముఖ్య‌మంత్రి రైతుల సంక్షేమం కోసం ప్ర‌త్యేక‌శ్ర‌ద్ద పెడుతున్న‌ర‌ని పుర‌పాల‌క‌శాఖ మంత్రి డాక్ట‌రు.పొంగూరు.నారాయ‌ణ అన్నారు.భారీ ఎత్తున ఇత‌ర దేశాల నుండి మ‌న‌దేశానికి ప‌ట్టు దిగుమ‌తి చేసుకుంటున‌మ‌ని,బంగారం తర్వ‌త మ‌న‌దేశంలో ప‌ట్టుకే ఎక్క‌వ విలువ వుంద‌న్నారు.రైతులు ప‌ట్టు సాగు చేసి ఆదాయం పెంచుకొవాలని కోరారు.ఈకార్య‌క్ర‌మంలో ఏజెసి-2 వెంక‌ట‌సుబ్బారెడ్డి,ఎ.పి.ఎం.ఐ.పి పిడి పి.ర‌మ‌ణారావు,సైంటిస్ట్‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY