రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు 12 వేల 780 రైతు ర‌థం (ట్రాక్ట‌ర్లు) పంపిణీ-మంత్రి సోమిరెడ్డి

0
221

నెల్లూరుః రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు 12 వేల 780 రైతు ర‌థం (ట్రాక్ట‌ర్లు) పంపిణీ జ‌రుగ‌గా,ఒక్క స‌ర్వేప‌ల్లి నియోజ‌వ‌ర్గాంనికి 162 ట్రాక్ట‌ర్లు పంపిణీ చేశామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ‌మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.మంగ‌ళ‌వారం స‌ర్వేప‌ల్లి నియోజ‌వ‌ర్గం తోట‌ప‌ల్లిగూడూరు ప‌రిధిలోని విలుకాని ప‌ల్లెలో నిర్వ‌హించిన జ‌న్మ‌భూమి-మా వూరు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ విలుకానిప‌ల్లెలో చంద్ర‌న్న‌భీమాప‌థ‌కం కింద చ‌నిపోయిన వారికి 30 వేల చొప్పున ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.89 మంది విద్యార్దుల‌కు 1200 వంతున స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తున‌మ‌న్నారు.భార‌త‌దేశంలో రైతుల‌కు రుణ‌మాఫీ చేసిన ఏకైక ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వంమ‌న్నారు.వ్య‌వ‌సాయ‌రంగంలో ఎక్క‌డా దుర్వినియోగం జ‌రుగ‌కుండా ఆధునికి సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడుతున్నామ‌న్నారు.లోపాలు వున్న వున్న భూముల‌కు బోరాన్‌,జిప్ప‌మ్‌,జింక్ ఉచితం పంపిణీ చేస్తున్న‌మ‌ని,ఇ క్రాప్ ద్వారా రైతుల వివ‌రాలుఉ ఆన్‌లైన్ పొందుప‌రిచామ‌న్నారు.అనంత‌రం పిల్ల‌ల‌కు అన్న‌ప్రాస‌నం నిర్వ‌హించారు,గ‌ర్భిణుల‌కు చీర‌లు,పండ్లు అంద‌చేశారు.అంత‌ర్గ‌త గ్రావెల్ రోడ్లు,సిమెంట్‌రోడ్లుకు ప్రారంభోత్స‌వాలు చేశారు.49 మంది ల‌బ్దిదారుల‌కు ఎ.కె.న‌గ‌ర్‌లో ఇళ్ల‌ప‌ట్టాలు పంపిణీ చేశారు.రుణుప‌శ‌మ‌న ప‌త్రాలు అందించారు.ఈ కార్య‌క్ర‌మంలో వెంక‌ట‌స్వామి,స‌ర్పంచ్ ప‌ద్మావ‌త‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY