ప్ర‌జ‌ల చెంత‌కు సాంకేతిక పరిజ్ఞానం-మంత్రి నారాయ‌ణ‌

0
189

నెల్లూరుః అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌డంలో భాగంగా వ్య‌వ‌సాయ‌రంగంలో డ్రోన్లు,పింఛ‌న్లు విష‌యంలో బ‌యోమెట్రిక్ విధానం,ఇ-ఫైలింగ్‌,పోలీసు విభాగంలో లాక్ట్ హౌస్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమ‌లు చేస్తుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ‌మంత్రి డాక్ట‌రు.పొంగూరు.నారాయ‌ణ వెల్లడించారు.మంగ‌ళ‌వారం 48వ డివిజ‌న్‌లో ఏర్పాటుచేసిన జ‌న్మ‌భూమి-మావూరు కార్య‌క్ర‌మంలో అయ‌న పాల్గొన్న సంద‌ర్బంలో మాట్లాడుతూ సాంకేతిక‌త‌-సుప‌రిపాల‌నపై ఈ రోజు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.భూసార ప‌రిక్ష‌లు,డ్రోన్ల వినియోగంతో పోలాల్లో పురుగు మందులు వెద‌చ‌ల్ల‌డం లాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు.149 రూపాయ‌ల‌కే ఫైబ‌ర్‌గ్రిడ్‌,2 రూపాయ‌ల‌కే 20 లీట‌ర్ల నీరు ఎన్.టి.ఆర్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్‌,నారాయ‌ణ‌గ్రూప్ ఆధ్వ‌ర్యంలో 21 కోట్ల రూపాయ‌ల సి.ఎస్‌.ఆర్‌.నిధుల‌తో చేపట్ట‌నున్న‌ట్లు తెలిపారు.ఈకార్య‌క్ర‌మంలో నూడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి.శ్రీనివాసుల‌రెడ్డి,తాళ్ల‌పాక‌.అనురాద‌,సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY