విద్యార్థులతో పాటు ఎగ్జామిన‌ర్లను కూడా జంబ్లింగ్

0
130

అమ‌రావ‌తిః ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల్లో విద్యార్థులతో పాటు ఎగ్జామిన‌ర్లను కూడా జంబ్లింగ్ చేసే విధానాన్ని అనుస‌రించాల‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు అధికారులను ఆదేశించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి బి. ఉద‌య‌ల‌క్ష్మి, ఇత‌ర ఉన్నతాధికారుల‌తో స‌మావేశం అయ్యారు. మంత్రి మాట్లాడుతూ, ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా పరీక్షలు నిర్వ‌హించాల‌ని, పరీక్షా కేంద్రాల వ‌ద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి కంప్యూట‌ర్ ద్వారా మానిట‌రింగ్ చేయాల‌ని ఆదేశించారు.ఎథిక‌ల్ అండ్ హ్యుమాన్ వాల్యూస్ అంశానికి సంబంధించిన‌ ప‌రీక్ష నిర్వహించే రోజున, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌ధాన కార్యాల‌యం నుంచే ఆ ప్ర‌శ్న‌ాప‌త్రాన్ని ఇవ్వాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు.అలాగే ఈ నెల 20న ప్రైవేటు, కార్పోరేట్ క‌ళాశాల‌ల మేనేజ్ మెంట్ల‌తో స‌మావేశ‌ం కానున్నట్లు తెలిపారు. ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు, ఇత‌ర అంశాల‌పై ప‌లు సూచ‌నలతో పాటు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ విషయమై ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఈ నెల 23న వీడియా కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించనున్నారు.

LEAVE A REPLY