మహత్మునికి ఘనంగా నివాళిర్పించిన మంత్రి అనిల్

నెల్లూరు: గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల గాంధీ విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్.పి. ఐశ్వర్య రస్తోగి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, ముక్కాల ద్వారకనాథ్, పి.రూప్ కుమార్ యాదవ్,  తదితరులు పాల్గొన్నారు.