సచివాలయం ఉద్యోగాలపై విష బీజం-ప్రజలు నమ్మలేదు-మంత్రి అనిల్

నెల్లూరు: మహాత్ముడు కలలు కన్న గ్రామ సచివాలయ పరిపాలను సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్షల మంది యువతకు ఉపాధి ద్వారా ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థపై టీడీపీ నాయకులు విషబీజలు నాటేందుకు ప్రయత్నించారని, అయితే వీరి మాటలను ప్రజల నమ్మలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యనించారు.బుధవారం నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచర్ల గ్రామ పంచాయితీలో గ్రామ సచివాలయ భవనంను ప్రారంభించిన సందర్బంలో మాట్లాడారు.ఈకార్యక్రమంలో రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబు తదితరులు పాల్గొన్నారు.