అన్ని ఎంట్ర‌న్స్ సెట్‌లు అన్‌లైన్‌లో-వారంలోపే ఫ‌లితాలు విడుద‌ల‌-మంత్రి గంటా

0
141

అమరావతిః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2018 సంవ‌త్స‌రంలో నిర్వహించనున్న వివిధ ఎంట్రన్స్ టెస్ట్‌ల‌ తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా. శ్రీనివాసరావు ప్రకటించారు. సోమవారం అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి గంటా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించారు.ఎంట్రెన్స్ టెస్ట్ లన్నీఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, వారంలోపే ఫలితాలు విడుదల చేస్తామన్నారు.ఎంసెట్ నిర్వహణకు 115 నుంచి 150 వరకు సెంటర్లను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అలాగే విశాఖలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను యూనిర్సిటీగా మార్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని,వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ యూనివర్సిటీకి అడ్మిషన్లు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 2018లో జరగబోయే వివిధ ఎంట్రెన్స్ సెట్ల పరీక్షల తేదీలు ఇలా వున్నాయి… ఏప్రిల్ 19న ఎడ్‌సెట్, లాసెట్ ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఏప్రిల్‌ 26న,, ఏపీ ఎంసెట్‌ మెడిసిన్‌ పరీక్ష మే 2న,, ఐసెట్‌ మే 3న,, ఈసెట్‌ మే 4న,, పీయూ సెట్‌,, మే 10 నుంచి 12 వరకు పీజీ సెట్

LEAVE A REPLY