రేప‌టి నుండి మూత‌ప‌డ‌నున్న Mee Sava కేంద్రాలు

పౌర‌సేవాల‌కు తీవ్ర అంత‌రాయం..అమ‌రావ‌తిః రాష్ట్ర వ్యాప్తంగా 10202 మీ సేవా కేంద్రాలు గురువారం నుండి మూత ప‌డ‌నున్నాయి.మీ సేవా కేంద్రాలు మూత‌ప‌డిన‌ట్ల‌యితే,,రోజు వారిన స‌ర్టిఫికేట్లు,ఇత‌ర డాక్యుమెంట్స్ కోసం కేంద్రాల‌కు వ‌చ్చే వేల సంఖ్య‌లో వినియోగ‌దారులకు క‌ష్ట‌లు మొదలు కానున్నాయి.ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంట చ‌ర్య‌లు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సి ప్ర‌శ్న ??
ఆస‌లు నేప‌థ్యంః పౌర సేవాల‌ను ప్ర‌జ‌ల‌కు త్వ‌రత‌గ‌తిన అందించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మీ సేవా కేంద్రాల ఆస‌లు ల‌క్ష్యం క్షేత్ర స్దాయిలో పూర్తిగా విఫ‌లం అవుతుంద‌ని మీ సేవాకేంద్రం నిర్వ‌హ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.ఉదాః ఒక వ్య‌క్తి కుల‌ధృవీక‌ర‌ణ స‌ర్టిఫికేట్ కోసం మీ సేవా కేంద్రంకు వెళ్లి,కుల ధృవీక‌ర‌ణ కోసం అవ‌స‌రంమైన డాక్యుమెంట్స్‌ను,సంబంధిత ఫీజును చెల్లిస్తాడు.కేంద్ర నిర్వ‌హ‌కులు సద‌రు స‌ర్టిఫికేట్స్‌ను స్కాన్‌చేసి,మీ సేవా కేంద్రం కోడ్ ద్వారా ఆప్‌లోడ్ చేస్తాడు.కులం స‌ర్టిఫికేట్ ఇచ్చేందుకు వెరిఫై చేసి,సంబంధిత వ్య‌క్తికి కులం స‌ర్టిఫికేట్ ఇవ్వ‌వ‌చ్చా? లేదా తిర‌స్క‌రించ వ‌చ్చా అన్నది సంబంధిత MRO నిర్ణ‌యించి,డిజిట‌ల్ సంత‌కం ద్వారా ఆప్‌లోడ్ చేస్తాడు.ఈ ప‌ద్దతిని ప్ర‌భుత్వం నిర్దేశించింది.అయితే క్షేత్ర స్దాయిలో ఇందుకు విరుద్దంగా,,రెవెన్యూ సిబ్బంది,మీ సేవాకేంద్రం నిర్వ‌హ‌కులు,VRO,RI,MRO వ‌ద్ద‌కు వినియోగ‌దారుడు అప్ల‌య్‌చేసిన డాక్యుమెంట్స్‌ను ఫిజిక‌ల్‌గా తీసుకుని వెళ్లి,వారి వ‌ద్ద సంత‌కం చేయించుకున్న‌త‌రువాత అప్‌లోడ్ చేయాలంటు,అవినితికి వెసుల‌బాటు క‌ల్పించుకున్నారనేది వాస్తంమ‌ని మండ‌ల స్దాయి మీసేవా నిర్వ‌హ‌కులు తెలిపారు.
ఆస‌లు క‌ష్టాలుః రెవెన్యూ వ్య‌వ‌స్ద‌కు తోడుగా ప్ర‌భుత్వం ఇటీవ‌ల క‌రెంట్ డిపార్ట‌మెంట్‌ను మీ సేవాకు అనుసంధానించింది. రెవెన్యూశాఖ‌కు మేము ఏమాత్రం తీసుపోమంటు,విద్యుత్‌శాఖ ఏ.ఇలు ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని,ఏ.ఇలు కూడా ఫిజిక‌ల్ డాక్యుమెంట్ తీసుకుని వ‌చ్చి సంతకం అయిన త‌రువాతే అప్‌లోడ్ చేయాలంటు హుకం జారీ చేశారు.ఇది వీరి డిపార్ట‌మెంట్ తీరు.
మీ సేవా కేంద్ర‌ల క‌మీష‌న్ః మీ సేవా కేంద్రాల నిర్వ‌హ‌కుల‌కు ఇటీవల ప్ర‌భుత్వం క‌మీష‌న్‌ను రూ.10 చేసింది.అయితే ఇందులో నిర్వ‌హ‌కులు అందేది కేవ‌లం రూ.4 మాత్ర‌మే మిగిలిన రూ.6 ల‌ను స‌ర్వ‌ర్‌ను మెయింటెన్ చేస్తున్న రామ్‌కో,కార్వీ లాంటి సంస్ద‌లు తీసుకుంటున్నాయి.
MRO డిజిట‌ల్ ఆదాయంః MRO మీ సేవా ద్వారా వ‌చ్చే స‌ర్టిఫికేట్‌కు ఒక్క డిజిట‌ల్ సంత‌కం చేస్తే వ‌చ్చేది రూ 8.50 పైస‌లు.ఈ లెక్క‌న నెలకు ఒక MRO దాదాపు 5 వేల సంత‌కాలు చేస్తే,,ఆదాయం 42 వేల రూపాయ‌లు.కాని వీరు చేయాల్సిన డిజిట‌ల్ సంతకాల‌కు ముందు మీ సేవా నిర్వ‌హ‌కులకు ఫిజిక‌ల్ రికార్డ్స్ పేరుతో చూక్క‌లు చూపిస్తున్నారు.
VRO,RI అవినితిః మీ సేవా నిర్వ‌హ‌కులను బెదిరిస్తు,VRO,RIలు వాళ్ల వ్య‌క్తిగ‌త కరెంట్ బిల్లు చెల్లంపులు చేయిస్తున్న‌ర‌ని మీ సేవా నిర్వ‌హ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.కేవ‌లం ఫిజిక‌ల్ రికార్డ్స్‌కు చోటు లేకుండా,ప్ర‌భుత్వం నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాలు ప‌క్కా ఆమ‌లు చేస్తే,,మీ సేవా కేంద్ర‌ల నిర్వ‌హ‌కులు నిరస‌న‌లు,బంద్‌లు చేయాల్సి అవ‌స‌రం వ‌స్తుందా ???
జిల్లాకు చెందిన రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ మంత్రి డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ‌కు వినతి ప‌త్రం ఇచ్చిన ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న లేద‌ని మీసేవా కేంద్రాల నిర్వ‌హ‌కుల సంఘం నాయ‌కులు తెలిపారు.

LEAVE A REPLY