న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు తీసి చూస్తే-అభివృద్ది క‌న్పిస్తుంది-మేయ‌ర్‌

0
170

అనంత‌ర‌పురంః నల్లద్దాలు పెట్టుకోవడం వల్లే ఎంపీ జేసీ దివాకరరెడ్డికి అనంతపురంలో తాము చేసిన అభివృద్ధి పనులు ఆయనకు క‌న్పిచ‌డం లేదనీ, అందువల్ల అద్దాలు తీసి నగరంలో పర్యటిస్తే తాము చేసిన అభివృద్ది పనులేంటో క‌న్పిస్తాయ‌ని అనంతపురం మునిసిపాల్ కార్పొరేష‌న్‌ మేయర్ స్వరూప తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చార‌ని,ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ అయితే బాగుంటుందని మేమంతా భావించి ప్రజల కాళ్లు పట్టుకుని ఓట్లు వేయించి గెలిపించామ‌న్నారు. అయితే ఇంత వరకు ఎంపి అనంతపురానికి అర్ధ రూపాయి కూడా ఆయన ఖర్చు పెట్టలేదని, తనకు వచ్చిన నిధులు కూడా ఖర్చు చేయ‌లేద‌ని ఆరోపించారు.అంతేకాకుండా, అనంతపురం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అని చెబుతున్నారని, ఇలాంటి సమయంలోనైనా మంచి పనులు చేసి విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని ఆమె సూచించారు.

LEAVE A REPLY