మసీదుల్లో షామియానాలూ,పాలిథీన్ షీట్లు,మంచినీటి కూలర్ల వసతి-మేయ‌ర్ అజీజ్‌

0
13

రంజాన్ ఉపవాస దీక్షకులకోసం ప్రత్యేక ఏర్పాట్లు
నెల్లూరుః పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకుల కోసం కార్పోరేషను ఆధ్వర్యంలో ప్రత్యేక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామనీ,నగరంలోని అన్నిమసీదుల్లో పవిత్ర వాతావరణం కనిపించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు.రంజాన్ పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కార్పోరేషను కౌన్సిల్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.కమిషనరు అలీం బాషాతో కలిసి సమావేశంలో వివిధ అంశాలను చర్చించిన అనంతరం మేయరు విలేఖరులతో మాట్లాడారు.వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా నగర వ్యాప్తంగా ఉన్న 115 మసీదుల్లో నిరంతరం మంచినీటి సరఫరా, చల్లటి నీటికోసం కూలర్లు, షామియానాలు, పాలిథీన్ షీట్లను అదజేయనున్నామని తెలిపారు.ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా జరిగేలా అధికారులకు ఆదేశాలిచ్చామనీ,మసీదులకు ఎన్టీఆర్ సుజల మంచినీటి కేంద్రాల నుంచి మంచి నీరు సరఫరా అయ్యేలా సూచనలు జారీ చేసామని మేయరు వివరించారు.ఈ స‌మావేశంలో క‌మీష‌న‌ర్ అలీంభాషా ముస్లిం నాయ‌కులు త‌దితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY