ఘనంగా ప్రారంభమైన మున్సిపల్ పాఠ‌శాలల క్రీడా ఉత్సవాలు

0
76

నెల్లూరుః నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ పాఠ‌శాలల విద్యార్ధులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తొలిసారిగా చేపట్టిన కీడా ఉత్సవాలు నగరంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గాంధీ బొమ్మ కూడలిలో మేయరు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకానాథ్, కమీషనరు అలీం బాషాల సారధ్యంలో వివిధ డివిజనులకు చెందిన కార్పోరేటర్లు,అన్నిమున్సిపల్ పాటశాలల విద్యార్ధులు వేడుకలలో పాల్గొన్నారు.తొలుత కూడలిలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి మేయరు ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం క్రీడా జాతిని వెలిగించి విద్యార్ధులతో కలిసి ర్యాలీని చేపట్టారు.గాంధీ బొమ్మ కూడలినుంచి సాగిన ర్యాలీలో వివిధ కూడళ్ళలో మున్సిపల్ పాఠ‌శాలల విద్యార్ధులు ప్రధాన ర్యాలీకి తోడయ్యారు.వి ఆర్ సి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
విద్యార్దులు ర్యాలీః- ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం చేరుకున్న విద్యార్ధులు,ఎన్ సిసి కాడెట్లు క్రీడోత్సవాలను పురస్కరించుకుని పాఠ‌శాలల వారీగా ముఖ్య అతిధులకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా జాతీయ పతాకం, క్రీడా పతకాలను మేయరు, కమీషనరులు ఆవిష్కరించారు. క్రీడల ప్రారంభాన్ని సూచిస్తూ క్రీడా జ్యోతిని ముఖ్య అతిధుల సమక్షంలో మేయరు, డిప్యూటీ మేయరులు వెలిగించి, బెలూన్లూ, శాంతి కపోతాలను ఎగరవేశారు.అనంతరం ప్రతిష్టాత్మక మేయరు కప్పును కమీషనరు అలీం బాషాతో కలిసి మేయరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన క్రీడల పోటీల్లో పలువురు విద్యార్ధులను విజేతలుగా నిర్వాహకులు ప్రకటించారు. విజేతలందరికీ 11వ తేదీన విఆర్ సి విద్యా సంస్థల మైదానంలో జరిగే వార్షికోత్సవం రోజు బహుమతులు అందించనున్నారు.ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఓఎస్ డీ పెంచల్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి, కొండ్రెడ్డి రంగారావు,కార్పోరేషను అధికారులు ప్రదీప్ కుమార్,అమరేంద్ర నాథ్ రెడ్డి,పాయసం వెంకటేశ్వర్లు,రాజేంద్ర ప్రసాద్,గిరిజా,పాఠ‌శాలల ప్రధానోపాధ్యాయులు,సామాజిక కార్యకర్తలూ పాల్గొన్నారు.

LEAVE A REPLY