మున్సిపల్ పాఠ‌శాలల విద్యార్ధుల క్రీడా పోటీలు

0
84

ఆహ్వాన పత్రాన్ని విడుదల చేసిన మేయరు 
నెల్లూరుః నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్రీడా పోటీలు, వార్షికోత్సవ వేడుకల్లో మున్సిపల్ పాఠ‌శాలల విద్యార్ధుల సత్తాను ఘనంగా చాటుతామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ ఆకాంక్షించారు. స్థానిక కార్పోరేషను కార్యాలయంలోని ఆయన ఛాంబరులో విలేఖరుల సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేసి కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని మేయరు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని 67 మున్సిపల్ పాఠ‌శాలల విధ్యార్ధులను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్రంలోనే తొలిసారిగా కనీవినీ ఎరుగని రీతిలో కార్పొరేటు స్కూళ్ళకు దీటుగా సామూహిక వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 7గంటలకు గాంధీ బొమ్మ కూడలిలో వేడుకలను ఆవిష్కరించి విద్యార్ధులూ, సామాజిక సేవా కార్యకర్తలతో క్రీడా జ్యోతిని ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహిస్తామనీ, అనంతరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు ఆటల పోటీలను ప్రణాళికాబద్ధంగా జరుపుతామని వివరించారు. క్రీడల్లో విద్యార్ధులను ప్రోత్సహించే క్రమంలో కార్పోరేషను అధికారులూ, కార్పోరేటర్లతో ప్రత్యేక జట్లను ఏర్పాటు చేసి వారి మధ్య క్రికెట్ పోటీలను నిర్వహిస్తామనీ, విజేతలకూ, ఉత్తమ ఆటగాళ్లకు వేడుకల్లో బహుమతులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా మేయరు క్రికెట్టు కప్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలైన జట్టు విద్యార్ధులకు మేయరు కప్పు, షీల్డులు, ధృవీకరణ పత్రాలను అందిస్తామన్నారు. 11వ తేదీన సాయంత్రం 4గంటలనుంచి విఆర్ విద్యాసంస్థల మైదానంలో జరిగే వార్షికోత్సవ వేడుకల్లో వివిధ రాష్ట్రాల కళాకారులతో అధ్బుతమైన సాంస్కృతిక ప్రదర్శనలూ, బాణా సంచా వెలుగులు, లేసర్ షో, నృత్యాలూ ఆద్యంతం వీక్షకులను అలరించేలా ప్రణాళికలు సిద్ధం చేసామని మేయరు వివరించారు. మున్సిపల్ పాటశాలల చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్ధుల తల్లితండ్రులను భాగస్వామ్యం చేస్తూ వారందరికీ పేరు పేరున ప్రత్యేక ఆహ్వాన పత్రాలను పంపి కార్యక్రమ విశిష్టతను వివరించామని చెప్పారు.

LEAVE A REPLY