పార్టీలకు అతీతంగా అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులు

0
63

నెల్లూరుః నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజనులకూ సమాన ప్రాధాన్యం కల్పిస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ అన్నారు. స్థానిక 24, 26 వ డివిజన్లు సుందరయ్య కాలనీ, అయ్యప్పగుడి హైవే కూడళ్ళలో నూతనంగా ఏర్పాటు చేసిన హై మ్యాస్టు లైట్లను మేయరు బుధవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 30 ప్రధాన కూడళ్ళలో హైమ్యాస్టు లైట్లను ఏర్పాటు చేశామనీ, ఎల్ ఈడి సాంకేతికత బల్బులతో అతి తక్కువ విద్యుత్ వినియోగం అవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి నగరంలో 32వేల ఎల్ ఈడి బల్బులతో విద్యుత్ వెలుగులు అందిస్తున్నామనీ, ప్రధానంగా రహదారుల్లో విద్యుత్ హై మ్యాస్ట్ దీపాల ఏర్పాటుతో ప్రమాదాలను నివారించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని మేయరు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు పాతపాటి పుల్లారెడ్డి, నరేష్, రాజా నాయుడు, ప్రశాంత్ కిరణ్, షంషుద్దీన్, మౌలానా, జలాల్, నగల్ల రామకృష్ణ, సందాని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY