పేదలకు భోజనం అందించడం అదృష్టంగా భావిస్తున్నాం-మేయరు

0
78

నెల్లూరుః ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో నిరుపేదలకు అతి తక్కువ ధరలకే పౌష్టికరమైన భోజనాన్ని మూడుపూటలా అందించడం తెలుగుదేశంపార్టీ చేసుకున్నఅదృష్టంగా భావిస్తున్నామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ సంతోషం వ్యక్తం చేసారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అన్న’ క్యాంటీన్’ పధకం అమలులో భాగంగా నగరంలోని తడికల బజారు,పాత మున్సిపల్ కార్యాలయం,చేపల మార్కెట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోజన శాలలను మేయరు బుధవారం ప్రారంభించారు.అనంతరం పేదలకు భోజనాన్ని తొలిరోజు ఉచితంగా అందించి, స్వయంగా భోజన నాణ్యతను మేయరు పరీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజంతా కష్టపడ్డా ఐదు వేళ్ళూ నోట్లోకి పోని నిరుపేదలు నగరంలో ఎందరో ఉన్నారనీ, వారందరికీ ఐదు రూపాయలకే కడుపునిండా భోజనం అందించాలన్న లక్ష్యంతో అన్న క్యాంటీను పధకం ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనరు అలీం బాషా,మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ క్రష్ణా రెడ్డి, నాయకులు అనూరాధా, నరసింహారావు,ఖాజావలి,శివప్రసాద్,మల్లికార్జున,శ్రీవిద్య,జానకి,సుజాత,సత్య నాగేశ్వర్,సుబ్బారావు,ఇక్బాల్, కార్పోరేషను అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY