మిస్ వ‌ర్డ‌ల్ కిరీటం గెలుచుకున్న మానిషి చిల్లార్‌

0
99

అమ‌రావ‌తిః 17 సంవ‌త్స‌రాల త‌రువాత ప్ర‌పంచ సుంద‌రిగా భారతీయ యువతి మానుషి చిల్లార్‌ విజయం సాధించి కిరీటం సొంతం చేసుకుంది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. శనివారం మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ పోటీలను నిర్వహించారు. హరియానాకు చెందిన మానిషి చిల్లార్ (21) డిల్లీలో డెర్మ‌టాజీ చ‌దువుతున్నారు.అమె రాజా-రాధ‌రెడ్డి ద‌గ్గ‌ర కూచిపూడిలో నృత్యంలో శిక్ష‌ణ తీసుకున్నారు. గ్రాండ్‌ ఫైనల్‌లో అందరినీ వెనక్కి నెట్టి కిరీటాన్నిగెలుచుకుంది. మొదటి రన్నరప్‌గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీఫెనీ హిల్‌ నిలిచింది.2000లో బాలీవుడ్‌ నటి ప్రియాంకాచోప్రా మిస్‌వరల్డ్‌గా నిలిచింది.1966 సంవ‌త్స‌రంలో మొద‌టి సారిగా భార‌త్‌కు చెందిన రీటా ఫారియా గెలుచుకుంది.

LEAVE A REPLY