స్మార్ట్‌ఫోన్‌ల‌పై ఏజెంట్ స్మిత్ పేరుతో మాల్వేర్ దాడి!

అమ‌రావ‌తిః ఏజెంట్ స్మిత్ పేరుతో ఓ కొత్త మాల్వేర్ భారత్ లోని స్మార్ట్ ఫోన్లపై దాడిచేస్తున్నట్టు నిపుణులు హెచ్చ‌రించారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఏజెంట్ స్మిత్ బారిన పడినట్టు గుర్తించారు.భార‌త్‌దేశంలోని 1.5 కోట్ల స్మార్ట్ ఫోన్లపై ఈ మాల్వేర్ పంజా విసిరినట్టు సమాచారం.ఇది గూగుల్ సంబంధిత యాప్ రూపంలో స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించి,అప్పటికే ఇన్ స్టాలైన యాప్‌లను ఇష్టానుసారం తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా, కొన్ని యాప్స్ సోర్స్ కోడ్ ను కూడా మార్చివేస్తుందట! తన ప్రొఫైల్ లో యాడ్స్ చూపించి ఆండ్రాయిడ్ ఫోన్లను ఇది ఏమార్చుతుందని,ఇది తమ ఫోన్ లో ఉందన్న సంగతి తెలుసుకునేసరికి ఎంతో డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.

LEAVE A REPLY