ఈనెల 20 నుండి లారీ స‌మ్మె

0
18

అమ‌రావ‌తిః ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు దిగనున్నారు.బుధ‌వారం విజయవాడలో అసోసియేషన్ అత్యవసర సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.ఈ సమ్మెకు 13 జిల్లాలకు చెందిన లారీ యజమానులు తమ మద్దతు తెలిపారు.పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని,ట‌ర్మ్‌పూర్తి అయిన‌ టోల్ ప్లాజాలను వెంటనే నిలిపివేయాలని,జీఎస్టీ,ఈ-వే బిల్ సమస్యలను పరిష్కరించాలని,థర్డ్ పార్టీ ప్రీమియం పెంపును నిలిపివేయాలని,డిమాండ్ చేస్తూ ఈ బంద్‌ను తలపెట్టనున్నట్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. .

LEAVE A REPLY