ఓ ఆమ్మాయి మ‌రో 3 గురు ఆమ్మాయిలతో పెళ్లి….?

0
163

క‌డ‌పః ఓ ఆమ్మాయి పేరు ర‌మాదేవి (18) సంవ‌త్స‌రాలు,ఈఆమ్మాయి ఒకరికి తెలియ‌కుండా,మ‌రోక‌రిని ఇలా మొత్తం 3 పెళ్లిలు చేసుకుంది.ఇలా పెళ్లిలు చేసుకున్న ర‌మాదేవి ఉద్దేశం ఏమిటి..?కడప జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన రమాదేవి పులివెందులలోని ఓ కాటన్ మిల్లులో పనిచేస్తోంది. అక్కడే జమ్మలమడుగు నియోజకవర్గంలోని భీమగుండం గ్రామానికి చెందిన మౌనిక అనే మరో యువతి కూడా పనిచేస్తోంది. ర‌మాదేవి మ‌గాడి గెటెప్‌లో వుంటు మౌనిక‌తో ప‌రిచ‌యం పెంచుకుంది, వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇంతకుముందే మరో 2 పెళ్లిలు జరిగాయ‌ని, మౌనికతో పెళ్లికి ముందే రమాదేవి వందన – బుజ్జి అనే మరో ఇద్దరు అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకున్నట్లు చెప్తోంది.తాజాగా వీరు చేసుకున్న వివాహం మీడియాలో రావ‌డంతో,, గతంలో వివాహం జరిగిన అమ్మాయిల తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయిల విషయంలో జరిగిన విషయాన్ని వెల్లడించారు.ర‌మాదేవి,, మౌనికను మళ్లీ పెళ్లి చేసుకుందన్న విషయం తెలిసిన మౌనిక‌ తల్లిదండ్రులు జమ్మలమడుగు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. 18 ఏళ్ల వయసుకే ఒక అమ్మాయి అయి ఉండి మరో ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కలకలం రేకెత్తిస్తోంది.ఈ పరిణామంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY