క‌ర్నూలు జిల్లా క్వారీ పేలుడు సంఘ‌ట‌న‌లో 9 మంది దుర్మ‌ర‌ణం

Copyright Rick Martin 2005

కర్నూలు: జిల్లాలోని ఆలురూ మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.ఓ క్వారీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తొమ్మిది మంది వరకు మృతి చెందారని,మ‌రో 8 మంది స‌మాచారం.పేలుడు శ‌బ్దం ధాటికి సమీప గ్రాస్థులు భయంతో పరుగులు పెట్టారు.పేలుడు కారణంగా మంటలు అంటుకొని మూడు ట్రాక్టర్లు,ఓ లారీ,షెడ్డు దగ్ధమయ్యాయి. పేలుళ్లను పట్టించుకోలేదని మండిపడుతూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.సంఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆదుపులోకి తెచ్చెందుకు ప్ర‌య‌త్నిస్తుంది.అక్కడే ఉన్న షెడ్డూలో ఇంకొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.క్వారీ పేలుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.