కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్ర‌మాణ‌స్వీకారం

0
177

అమ‌రావ‌తిః కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా బుధ‌వారం ప్రమాణ స్వీకారం చేయించారు.కుమారస్వామి (59) బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి, 2006లోనూ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర (67) ప్రమాణ స్వీకారం చేశారు.పీహెచ్‌డీ పట్టా పొంది అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన పరమేశ్వర ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్నారు.ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌, కేరళ, ఏపీ, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, చంద్రబాబు నాయుడు, కేజ్రీవాల్‌తో పాటు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఎం, సీపీఐ ముఖ్య నేతలు సహా పలువురు హాజరయ్యారు.

LEAVE A REPLY