కుమార‌స్వామికి సెంటిమెంట్‌తో ప‌ద‌వీ గండం ?

0
261

అమ‌రావ‌తిః రాజ‌కీయ‌నాయ‌కులు ప‌ద‌వులు ఏలాంటి స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌ని,రాక రాక‌ల సెంటిమెంట్‌లును ఫాలో అవుతుంటారు.కొంత మంది బాబాల ద‌గ్గ‌ర ఆశ్వీర‌దం తీసుకుంటే,మ‌రి కోంత మంది ఉంగరాలు,తాయ‌త్తులు,క‌ట్టుకుని ప‌ద‌వీలో కొన‌సాగుతుంటారు.అయితే ఇందుకు విరుద్దంగా కొంత మంది నాయ‌కులు సెంటిమెంట్‌ల‌ను ప్ర‌క్క‌న పెట్టి వారి ప‌ని చేసుకుని పోతుంటారు.ఈ కోవలోకి ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి వ‌స్తాడు. అస‌లు విష‌యానికి వ‌స్తే,బెంగుళూరు విధానసౌధ ముందు ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించటంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.గత చరిత్రను చూస్తే విధానసౌధ ముందు ప్రమాణస్వీకారం చేసిన ఏ ప్రభుత్వం పూర్తికాలం కొన‌సాగ‌లేద‌ని, ఏ ముఖ్యమంత్రి పదవీకాలం పూర్తి చేయలేకపోయారని చెబుతారు. ఈ సెంటిమెంట్ ప్ర‌కారం కుమారస్వామికి ఈసారి సైతం పదవీ గండం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.గత అనుభవాల్ని చూస్తేః–* విధానసౌధ దగ్గర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బంగారప్ప (1990) కూడా పూర్తికాలం పదవిలో ఉండలేదు. కావేరీ జలాల విషయమై రాష్ట్రంలో అల్లర్లు చెలరేగటంతో రెండేళ్లలోనే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.*1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారి విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే సీఎం పదవిని కోల్పోయారు.*అదే ఏడాది హెగ్డే మరోసారి సీఎంగా ప్రమాణం చేసినా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో మళ్లీ పదవి పోగొట్టుకున్నారు* ఇప్పటి మాదిరే విధానసౌధ దగ్గర బీజేపీ మద్దతుతో 2006లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి 20 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండగలిగారు* 2008లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా.. యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా విధాన సౌధ ఎదుట భారీ ఎత్తున ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలోనూ.. యడ్యూరప్ప మూడేళ్లకే అవినీతి ఆరోపణలతో సీఎం పదవిని పోగొట్టుకున్నారు.

LEAVE A REPLY